
భద్రాచలం: నేడు శ్రీరామనవమి సందర్భంగా గవర్నర్ తమిళిసై భద్రాచలం సందర్శించనున్నారు. సీతారాముల కల్యాణం సందర్భంగా భద్రాద్రికి గవర్నర్, వీఐపీలు వస్తుడడంతో ఆలయ అధికారులు, పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టారు. రేపు రామప్ప ఆలయాన్ని గవర్నర్ సందర్శించనున్నారు. రెండ్రోజుల పాటు భద్రాచలంలోని మూడు గ్రామాలను గవర్నర్ తమిళిసై సందర్శించనున్నారు.