నేడు కర్నూలుకు చంద్రబాబు

ABN , First Publish Date - 2021-03-04T06:46:05+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం కర్నూలుకు రానున్నారు. కార్పొరేషన్‌ పరిధిలో ప్రచారం చేయనున్నారు.

నేడు కర్నూలుకు చంద్రబాబు

  1. నగరంలో రోడ్‌షో


కర్నూలు(అగ్రికల్చర్‌), మార్చి 3: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం కర్నూలుకు రానున్నారు. కార్పొరేషన్‌ పరిధిలో ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పంచలింగాల టోల్‌గేట్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి పెద్దమార్కెట్‌ ఎదురుగా శ్రీలక్ష్మి నరసింహస్వామి కల్యాణ మండపం వద్దకు చేరుకుని పాతబస్టాండు, గోశా హాస్పిటల్‌, స్టేట్‌ బ్యాంకు, ఎస్టీబీసీ కళాశాల మీదుగా ఐదు రోడ్ల కూడలి, మౌర్యఇన్‌, బంగారు పేట, ఈద్గా, కొత్తబస్టాండు, బళ్లారి చౌరస్తా, చెన్నమ్మ సర్కిల్‌కు వరకు రోడ్‌షోలో పాల్గొంటారు. రోడ్‌షోలో చంద్రబాబు ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలతో మాట్లాడుతారని, చెన్నమ్మసర్కిల్‌ వద్ద చైతన్య రథం నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని టీడీపీ కర్నూలు లోక్‌సభ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. టీడీపీ గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరిస్తారన్నారు. 


గెలుపు టీడీపీదే: సోమిశెట్టి

మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపు టీడీపీదేనని టీడీపీ కర్నూలు లోక్‌సభ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. నగరంలోని టీడీపీ కార్యాల యంలో వారు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ అధికార మదంతో వైసీపీ నాయకులు టీడీపీ అభ్యర్థులను భయపెడుతు న్నారని, ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా తమ అభ్యర్థులు లొంగకుండా పోటీలో నిలిచారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా వైసీపీ నాయకులు ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా ఓటర్లు టీడీపీ మద్దతుదారులకు విజయం అందించారన్నారు. నగరంతో పాటు ఇతర మున్సిపాలిటీలలో ప్రజలు టీడీపీకి అధికారం అప్పగించేందుకు ఎదురు చూస్తున్నా రన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కర్నూలు నగరంలో రూ.1200 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం, పార్కుల అభివృద్ధికి ఎన్నో చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. అయితే జగన్‌ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల వుతున్నా రూ.12 కోట్లు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. సమావేశంలో కె.నాగేంద్రకుమార్‌, మంచాలకట్ట భాస్కర్‌ రెడ్డి, రవికుమార్‌, సత్రం రామకృష్ణుడు, మహేష్‌గౌడు, హనుమంతరావు చౌదరి, అబ్బాస్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-04T06:46:05+05:30 IST