
ముంబై: ఐపీఎల్ 2022లో భాగంగా Gujarat Titans, Sunrisers Hyderabad జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో Gujarat Titans జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వాంఖడేలో ఛేజింగ్ చేసిన టీంకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనా ఉండటంతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నట్లు తెలిసింది. వాంఖడే స్టేడియంలో ఈ సీజన్లో SRH ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. అంతేకాదు.. ఈ సీజన్‌లో SRH కెప్టెన్ విలియమ్‌సన్ టాస్ ఓడిపోవడం కూడా ఇదే తొలిసారి. తుది జట్ల వివరాలిలా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియంసన్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, మర్క్రమ్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), శషాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, జాన్‌సేన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్
గుజరాత్ టైటాన్స్: సాహా(వికెట్ కీపర్), గిల్, హార్థిక్ పాండ్యా(కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, జోసెఫ్, ఫెర్గ్యూసన్, యష్ దయాళ్, మహ్మద్ షమీ