Today IPL Match: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న Lucknow Super Gaints

ABN , First Publish Date - 2022-05-01T20:38:51+05:30 IST

IPL 2022 సీజన్‌లో భాగంగా 45వ మ్యా్చ్ Delhi Capitals, Lucknow Super Gaints జట్ల మధ్య ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు జరగబోతున్న మ్యాచ్‌లో లక్నో జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు..

Today IPL Match: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న Lucknow Super Gaints

IPL 2022 సీజన్‌లో భాగంగా 45వ మ్యాచ్ Delhi Capitals, Lucknow Super Gaints జట్ల మధ్య ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు జరగబోతున్న మ్యాచ్‌లో లక్నో జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వాంఖడే స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో తొలుత బ్యాటింగ్ చేసి భారీ టార్గెట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ముందు నిలపాలన్నది కేఎల్ రాహుల్ వ్యూహంగా తెలుస్తుంది. ఓపెనర్లు డీ కాక్, కేఎల్ రాహుల్ రాణిస్తే భారీ స్కోర్ రావడం ఖాయం. ఈ మ్యాచ్‌కు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నిలవనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల బలాబలాలను ఒక్కసారి పరిశీలిద్దాం. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికొస్తే.. రిషబ్ పంత్ కెప్టెన్సీ వహిస్తున్న ఈ జట్టు ipl points tableలో ఆరవ స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ జట్టు నాలుగింటిలో గెలిచి, నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ గత మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టును ఓడించి జయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోల్‌కత్తా జట్టును 146 పరుగులకు కట్టడి చేయగలిగింది. ఢిల్లీ బౌలర్ కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు ఓపెనర్ వార్నర్ 42 పరుగులతో రాణించడంతో 19 ఓవర్లలోనే 150 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.



ఢిల్లీ జట్టు బ్యాట్స్‌మెన్ ఫామ్ విషయానికొస్తే.. ఓపెనర్ పృథ్వీ షా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. కెప్టెన్ పంత్ కూడా చెప్పుకోదగ్గ విధంగా స్కోర్ చేయడం లేదు. ఆడిన 8 మ్యాచ్‌ల్లో 192 పరుగులు మాత్రమే చేశాడు. మిచెల్ మార్ష్ ఆశించిన స్థాయిలో రాణిస్తే ఢిల్లీకి మంచి స్కోర్ దక్కడం ఖాయం. ఢిల్లీ బౌలింగ్‌ విభాగంలో కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముస్తఫిజూర్, చేతన్ సకారియా రాణిస్తుండటం ఢిల్లీ క్యాపిటల్స్‌కు కలిసొచ్చే అంశం. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు, లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మధ్య ఒక మ్యాచ్ జరగ్గా.. ఆ మ్యాచ్‌లో లక్నో జట్టు విజయం సాధించింది. లక్నో  జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని ఢిల్లీ జట్టును 149 పరుగులకు కట్టడి చేసింది. 150 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన లక్నో  జట్టు 20వ ఓవర్‌లో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల నష్టానికి 155 పరుగులు  చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.



ఇక.. లక్నో  జట్టు గత మ్యాచ్‌ను ఒకసారి పరిశీలిస్తే.. కేఎల్ రాహుల్ సేన పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టును ఓడించి 20 పరుగుల తేడాతో విజయాన్ని చేజిక్కించుకుంది. ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన లక్నో జట్టు 153 పరుగులు చేసింది. 154 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు 133 పరుగులకే చేతులెత్తేసింది. లక్నో జట్టు ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 9 మ్యాచ్‌లు ఆడి 6 మ్యాచ్‌ల్లో గెలిచి, 3 మ్యాచ్‌ల్లో ఓడింది. IPL పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. లక్నో జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో పాటు డీ కాక్ కూడా ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లో చమీరా, అవీష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, క్రూనల్ పాండ్యా రాణిస్తున్నారు. ఇక.. వాంఖడే స్టేడియం గురించి చెప్పుకోవాలంటే.. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 184. సెకండ్ బ్యాటింగ్‌కు విన్నింగ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఛేజింగ్‌ ఆడే టీంకు దాదాపు 60 శాతం గెలుపు అవకాశం ఉండటం గమనార్హం. ఇరు టీమ్స్ తుది జట్ల వివరాలిలా ఉన్నాయి.


ఢిల్లీ క్యాపిటల్స్ (Playing XI): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(వికెట్ కీపర్ & కెప్టెన్), లలిత్ యాదవ్, పావెల్, అక్సర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తఫిజూర్ రెహ్మాన్, చేతన్ సకరియా


లక్నో సూపర్ జెయింట్స్ (Playing XI): క్వింటన్ డీ కాక్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్(కెప్టెన్), దీపక్ హుడా, మార్కస్ స్టోనిస్, ఆయుష్ బడోని, క్రూనల్ పాండ్యా, క్రిష్టప్ప గౌతమ్, హోల్డర్, చమీరా, మొహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయి

Updated Date - 2022-05-01T20:38:51+05:30 IST