నగరంలో నేడే ఊర పండుగ

ABN , First Publish Date - 2021-07-25T06:07:59+05:30 IST

జిల్లా కేంద్రంలో పల్లెసంస్కృతికి పట్టం కట్టే ఊర పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు సర్వసమాజ్‌ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.

నగరంలో నేడే ఊర పండుగ
ప్రతిష్ఠాపనకు ముస్తాబైన గ్రామదేవతల ప్రతిమలు

ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు, సర్వసమాజ్‌ కమిటీ సభ్యులు
కొవిడ్‌ నిబంధనలతో అమ్మవార్లను దర్శించుకోవాలని విజ్ఞప్తి

నిజామాబాద్‌ కల్చరల్‌, జూలై 24: జిల్లా కేంద్రంలో పల్లెసంస్కృతికి పట్టం కట్టే ఊర పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు సర్వసమాజ్‌ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. శాస్త్రీయ త, సంస్కృతి, విశిష్టతతో జరుపుకొనేది ఊర పండుగ. గతంలో నిజామాబాద్‌లో ప్లేగు అతిసార వంటి వ్యా ధుల ప్రభావంతో చాలామంది ప్రజలు ప్రాణాలుకోల్పోయారు. వేల సంఖ్యలో పశువులు మృత్యువాత ప డ్డాయి. దీంతో ప్రజలు ఇలాంటి వ్యాధుల నుంచి త మను, పశువులను రక్షించుకుందామని మొక్కులను తీర్చుకుని జరుపుకొన్న పండుగగా ఊర పండుగకు విశిష్టత కలిగి ఉంది. ఊర పండుగను ఊరంతా కలిసి పెద్దఎత్తున నిర్వహించడం 1935వ సంవత్సరం నుంచి ప్రారంభమైంది.
గ్రామ దేవతలకు పూజలు
వంశ పారంపర్య పూజారుల పర్యవేక్షణలో పెద్ద మ్మ, ఐదుచేతుల పోశవ్వ, మత్తడి పోశవ్వ, మహాలక్ష్మ వ్వ వంటి 13 గామ్ర దేవతలకు ఖిల్లా రఘునాథ ఆ లయం సమీపంలో తేలు మైసమ్మ గద్దె వద్ద పూజలు జరిపి డప్పులు, పోతరాజుల విన్యాసాలతో ఊరేగిస్తా రు. గ్రామ దేవతలని ప్రతిబింబాలుగా తొట్టెలను కూ డా ఊరేగిస్తారు. తొట్టెలకింద నుంచి వెళ్తే అమ్మవార్ల దయ తమపై ఉంటుందని ప్రజలు విశ్వసిస్తారు.
ఊర పండుగలో సిరికి ప్రత్యేక స్థానం
ఊర పండుగలో సిరి గుల్ల అనే విశేష పదార్థానికి ప్రత్యేక స్థానం ఉంది. సిరిగుల్లలో బియ్యం, జొన్న పిం డిలో పసుపు, కుంకుమ, వేపాకు, కలిపి కదంబంగా వండుతారు. గొర్రెను గావ పట్టిన రక్తంను సిరికి కలుపుతారు. రెండు గుల్లల్లో కలిపి ఒక గుల్లను పెద్దబజా ర్‌ మీదుగా దుబ్బవైపు, మరో గుల్లను కోటగల్లి నుంచి వినాయక్‌నగర్‌వరకు తరలించి అంతటా చల్లుతారు.
 సరికి ప్రత్యేక ఆకర్షణ
ఊర పండుగలో వివేకానంద చౌరస్తాపై నిర్వహించే సరిపై భక్తు లు ఆత్రుతను కనబరుస్తా రు. గ్రామ దే వతల కోసం పసుపు బి య్యం, సజ్జ లు, నవరత్నా లు తదితర వా టితో తయారు చేసిన పదార్థం సరి. వివేకానంద చౌర స్తా వద్ద గ్రామ దేవతలకు బలిగా మేక ను నోటితో గావప ట్టి దాన్ని సరితో కలుపుతారు. సరిప్రసాదం కోసం భక్తులు ఆసక్తి కనబరుస్తారు. సర్వసమాజ్‌ కమిటీ సభ్యులు భక్తులకు పంపిణీ చేస్తారు. సరిని ఇంటిపై చల్లుకుంటే ఋతువులను అనుసరిం చివచ్చే వ్యాధులు దరికి చేరవని ప్రజల నమ్మకం.
పసుపు కుంకుతో అమ్మవారికి పూజలు
అంటూరోగాలు తొలగిపోయి, పాడి పంటలతో సంతోషంగా ఉండాలని భక్తులు అమ్మవా రిని పసుపు, కుంకుమతోపూజిస్తా రు. తమ ఇళ్లముందుకు వచ్చిన గ్రామదేవతలకు భక్తులు నీళ్లతో స్వాగతం పలుకుతూ పసు పు, కుంకుమ, పూలు, కొబ్బరికాయలతో పూజిస్తా రు. అమ్మవారి ముందు వినయంగా దర్శించుకునేవిధంగా తొట్టెలోంచి వంగి వెళ్తూ అమ్మవారిని దర్శించుకోవ డం ప్రత్యేకంగా భావిస్తారు. తొట్టెలోంచి వెళ్లి అ మ్మ ను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయ ని భక్తుల విశ్వాసం. గత యేడాది కరోనా కారణంగా ఊ రపండుగను నిర్వహించలేదు. దీంతో భక్తులు ఈ సా రి పండుగను పెద్దఎత్తున నిర్వహించుకునేందుకు సి ద్ధమయ్యారు. అలాగే, అమ్మవార్లను ఘనంగా పూజించడానికి సన్నద్ధం అవుతున్నారు.
ముస్తాబైన మైసమ్మగద్దె
గ్రామ దేవతలను ప్రతిష్ఠించే తేలు మైసమ్మ గద్దె ను రంగులు, తోరణాలతో శనివారం సర్వసమాజ్‌ స భ్యులు ముస్తాబు చేశారు. ఉదయం నుంచే భక్తులు గ్రామ దేవతలకు మొక్కులను చెల్లించే విధంగా ఏ ర్పాట్లు చేశారు. నగరపాలకసంస్థ సిబ్బందితో గద్దె పరిసర ప్రాంతాలను శుభ్రపరిచింది. లైటింగ్‌ బారికేడ్లు, తాగునీటి సౌకర్యం తదితర ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శించుకునే విధంగా సర్వసమాజ్‌ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
పండుగను ఆనందంగా జరుపుకోవాలి..
- పండుగ కమిటీ కన్వీనర్‌ రామర్తి గంగాధర్‌

తెలంగాణకే ప్రత్యేకంగా నిలుస్తున్న ఊర పండుగ ను నగర ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని పం డుగ కమిటీ కన్వీనర్‌ రామర్తి గంగాధర్‌ కోరారు. కొవి డ్‌ నిబంధనలు పాటిస్తూ గ్రామదేవతలను దర్శించుకోవాలన్నారు. ఊరేగింపు మార్గమధ్యలో మాస్కులు ధరించి అమ్మవారిని పూజించుకోవాలని కోరారు.
ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బిగాల
నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలో ఆదివారం జరగనున్న ఊర పండుగ ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా పరిశీలించారు. దేవతామూర్తుల దర్శనానికి వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులు, పోలీసులకు సూచించారు. ఊరేగిం పు జరిగే రూట్‌ మ్యాప్‌ను పరిశీలించారు. ప్రజలు, భ క్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నా రు. అనంతరం నగరంలోని రఘునాథ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌ను పరిశీలించి డిస్టిలేషన్‌ ప్రక్రియను ప రిశీలించారు. ఆయన వెంట మేయర్‌ దండు నీతూ కిరణ్‌, రెడ్‌కో చైర్మన్‌ ఎస్‌ఏ అలీం, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-07-25T06:07:59+05:30 IST