నేడు మొహర్రం

ABN , First Publish Date - 2022-08-09T05:35:30+05:30 IST

జిల్లా వ్యాప్తంగా మొహర్రం పండుగను మంగళవారం జరుపుకోనున్నారు. పీ

నేడు మొహర్రం
వీణవంక మండలం నర్సింగాపూర్‌ గ్రామంలో నిప్పుల గుండం తొక్కుతున్న భక్తులు.

కరీంనగర్‌ కల్చరల్‌, ఆగస్టు 8: జిల్లా వ్యాప్తంగా మొహర్రం పండుగను మంగళవారం జరుపుకోనున్నారు. పీరీలకు ప్రత్యేక పూజలు జరిపి జామా మసీదు పక్కన నిలుపనుండగా ముస్లింలు, హిందువులు పిల్లా పాపలతో హాజరై బత్తీసలు, కుడుకలు, మర్మరాల దండలు సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు. మసీద్‌లలో ప్రార్థనలకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగనున్నాయి. బాబానగర్‌, టెలీఫోన్‌భవన్‌, జామామసీద్‌ ప్రాంతంలో పీరీలను నిలుపగా పలువురు దట్టీలు కట్టుకొని మెక్కులు చెల్లించుకున్నారు. 

  వీణవంక: మండలంలోని నర్సింగాపూర్‌, కనపర్తి, మామిడాలపల్లి, బేతిగల్‌ , పోతిరెడ్డిపల్లి, ఘన్ముక్ల, కోర్కల్‌ గ్రామాల్లో మొహర్రం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు మట్టి కుండలలో బెల్లము పానకంతో చేసిన షరబత్‌, మలిద ముద్దలతో పాతియా తయారు చేశారు. మసీదుల వద్ద ఏర్పాటు చేసిన అగ్ని గుండాలను  భక్తులు దాటారు. తొమ్మిదిరోజుల పాటు ఉపవాస దీక్షలు చే సిన అనంతరం పదోరోజు గ్రామంలో ఊరేగింపుగా పీరీలను తీసుకెళ్లి అనంతరం నిమజ్జనం చేయనున్నారు.  కార్యక్రమంలో మసీదు కమిటీ అధ్యక్షుడు రజాక్‌, సర్వర్‌, అంకూస్‌ హజమియా, మహబూబ్‌ ఆలీ, రోషణ, ఆలీ, రఫీ, ఇమ్రాన్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-09T05:35:30+05:30 IST