నేడు మంత్రి హరీశ్‌రావు రాక

ABN , First Publish Date - 2022-01-25T05:58:11+05:30 IST

రాష్ట్ర వెద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు.

నేడు మంత్రి హరీశ్‌రావు రాక
కొల్లాపూర్‌లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభించనున్న 50 పడకల ఆసుపత్రి భవనం

కొల్లాపూర్‌/నాగర్‌కర్నూల్‌/వనపర్తి, జనవరి24 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర వెద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భం గా సోమవారం సాయంత్రం కలెక్టర్‌  ఉదయ్‌కుమార్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.  బెడ్ల కొరత ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కేవలం మెటర్నిటీ హెల్త్‌కేర్‌ కోసమే ప్రత్యేకంగా ఆస్పత్రులను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ జిల్లా కేంద్రంలో 100 పడకలతో ఆస్పత్రి ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో వీటి సేవలు అందుబాటులోకి రాగా.. వనపర్తి జిల్లా కేంద్రంలోని అప్పాయిపల్లి శివారులో 2018 సంవత్సరంలోనే రూ.17కోట్ల నిర్మాణ వ్యయంతో 8 ఎకరా ల్లో ఏర్పాటు చేసేందుకు  ఎంసీహెచ్‌ నిర్మాణానికి శంకు స్థాపపన చేశారు. ఎట్టకేలకు అది 2002 జనవరి నాటికి పూర్తయ్యింది. ఇటీవల నిర్మాణం పూర్తికావడంతో నేడు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. గతంలో నవజాత శిశువులకు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే.. ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లి, ఎస్‌ఎన్‌సీయూలో ఉంచేవారు. కానీ ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఎస్‌ఎన్‌సీ యూను ప్రారంభించబోతున్నారు.  పుట్టిన రోజు నుంచి 28 రోజుల వరకు శిశువుకు ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తిన ఇక్కడ చికిత్స చేసేందుకు అవకాశం ఉంది.  వనపర్తి జిల్లా నుంచి ప్రారంభమయ్యే మంత్రి పర్యటన నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో ముగియనుం ది. మధ్యాహ్నం 3:30గంటలకు కొల్లాపూర్‌ పట్టణంలోని 50 పడకల ఆసుపత్రిని ప్రారంభి స్తారు. ఆ తరువాత నాగర్‌క ర్నూల్‌ జిల్లా కేంద్రంలో   పాలియేటివ్‌ కేంద్రాన్ని ప్రారంభి స్తారు. శాశ్వత వ్యాధులతో బా ధపడుతున్న వారి కోసం ప్రత్యే కంగా 6బెడ్లు ఏర్పాటు చేసి 24గంటల పాటు వారికి సేవ లందించేందుకు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 19 కేంద్రాలు ఏర్పాటు చేయగా 20వ   కేంద్రాన్ని నాగర్‌కర్నూల్‌లో ప్రారంభిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఆతర్వాత పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని ఆడిటోరియంలో నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాలకు సంబంధించిన వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించనున్నారు. కొవిడ్‌ మూడో దశ నేపథ్యంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, మున్ముందు అనుసరించాల్సిన విధానాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. 

Updated Date - 2022-01-25T05:58:11+05:30 IST