నేడు 16వ విడత మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

ABN , First Publish Date - 2021-12-26T13:34:02+05:30 IST

రాష్ట్రంలో కొత్తరూపు సంతరించుకున్న కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ వ్యాప్తి చెందుతుండటంతో ఆదివారం 16వ విడత వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను మరిన్ని ఏర్పాట్లతో నిర్వహించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

నేడు 16వ విడత మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

చెన్నై: రాష్ట్రంలో కొత్తరూపు సంతరించుకున్న కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ వ్యాప్తి చెందుతుండటంతో ఆదివారం 16వ విడత వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను మరిన్ని ఏర్పాట్లతో నిర్వహించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా మొదటి డోసు టీకా వేసుకున్నవారు రెండో డోసు టీకా వేయించుకునేం దుకు శిబిరాల వద్దకు వచ్చేలా అవగాహన ప్రచారం చేయాలని కూడా భావిస్తున్నారు. గత కొద్దివారాలుగా శనివారాల్లో నిర్వహిస్తుండిన వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను క్రిస్మస్‌ కారణంగా ఆదివారానికి మార్చారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన 15 వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ శిబిరాల వద్దకు ప్రజలు చేత ఆధార్‌కార్డులు పట్టుకుని బారులు తీరుతున్నారు. ప్రస్తుతం ‘ఒమైక్రాన్‌’ వైరస్‌ భయం అధికం కావటంతో ఆదివారం నిర్వహించనున్న టీకాల శిబిరాలకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివస్తారనే ఉద్దేశంతో శిబిరాల వద్ద అదనంగా ఆరోగ్య సిబ్బందిని నియమిస్తున్నారు. బస్టాండ్లు, మార్కెట్లు, సినిమా థియేటర్లు, మాల్స్‌ వద్ద ఏర్పాటు చేసే టీకా శిబిరాల వద్ద ముగ్గురు ఆరోగ్యసిబ్బంది మాత్రమే వుండేవారు. ఆదివారం ఈ శిబిరాల వద్ద అదనంగా మరో నర్సును టీకాలు వేయడానికి నియమించనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా 50 వేల చోట్ల ఈ టీకాల శిబిరాలను నిర్వహించనున్నారు. చెన్నైలో ఎప్పటివలెనే 1600 చోట్ల వ్యాక్సినేషన్‌ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్టు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేదీ తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా తప్పకుండా టీకాలు వేసుకునేందుకు శిబిరాలకు తరలిరావాలంటూ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ సెల్వవినాయగం ఓ ప్రకటన జారీ చేశారు.

Updated Date - 2021-12-26T13:34:02+05:30 IST