
పాడేరు, జనవరి 23: స్థానిక మోదకొండమ్మ ఆలయం ఆవరణలో ఆదివారం తీర్థం జరగనుంది. ఈ వేడుకలో భాగంగా ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం పట్టణవీధుల్లో అమ్మవారి సారె ఊరేగింపు, అమ్మవారి విగ్రహం, పాదాలు ఊరేగింపు నిర్వహిస్తారు, ఎమ్మెల్యే, ఆలయ కమిటీ అఽధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో తీర్థం ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రతినిధులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.