నేడు సద్దుల బతుకమ్మ

ABN , First Publish Date - 2022-10-03T05:43:03+05:30 IST

బతుకమ్మ వేడుకల్లో చివరి రోజు సోమవారం సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా సిద్ధమైంది. ఎంగిలి పూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభం కాగా, జిల్లా వ్యాప్తంగా వరుసగా కురిసిన వర్షాలతో మహిళలు రోజు బతుకమ్మ ఆడేందుకు ఆటంకం ఏర్పడింది.

నేడు సద్దుల బతుకమ్మ
సద్దులచెరువు మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద విద్యుత్‌ కాంతులతో స్వాగత తోరణం

సద్దులచెరువులో నిమజ్జనానికి ఏర్పాట్లు

 పూల కొనుగోళ్లతో మహిళల సందడి


సూర్యాపేట కల్చరల్‌, అక్టోబరు 2 : బతుకమ్మ వేడుకల్లో చివరి రోజు సోమవారం సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా సిద్ధమైంది. ఎంగిలి పూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభం కాగా, జిల్లా వ్యాప్తంగా వరుసగా కురిసిన వర్షాలతో మహిళలు రోజు బతుకమ్మ ఆడేందుకు ఆటంకం ఏర్పడింది. కాగా, రెండు రోజులుగా వర్షం లేకపోవడంతో సోమవారం సద్దుల బతుకమ్మను ఉత్సాహంగా నిర్వహించేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. రంగు రంగుల పూలతో బతుకమ్మను తీర్చిదిద్దేందుకు ఆదివారం పూలు కొనుగోలు చేశారు. దీంతో జిల్లా కేం ద్రంలోని పాతబస్టాండ్‌, వాణిజ్యభవన్‌ సెంట ర్‌, పూల సెంటర్‌, కొత్తబస్టాండ్‌ ప్రాంతాల్లో మహిళల సందడి నెలకొన్నది. డిమాండ్‌ను బట్టి బంతి,  చామంతిపూలు కిలో రూ.100 నుంచి రూ.150వరకు విక్రయించారు. మామూలు రోజుల్లో కిలో రూ.100లోపే ధర ఉంటుంది. ఇదిలా ఉండగా, సద్దుల బతుకమ్మలను పట్టణంలోని సద్దుల చెరువులో నిమజ్జ నం చేసేందుకు మునిసిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. చెరువు నిండుకుండలా ఉండటంతో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా, బ్యారీకేడ్లు, విద్యుత్‌ దీపాలు ఏర్పాటుచేశారు. అదేవిధంగా అలాగే పట్టణమంతటా వీధి దీపాలు వెలిగేలా ఏర్పాట్లు పూర్తిచేశారు. 200 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-10-03T05:43:03+05:30 IST