నాడు - నేడుతో మారిన పాఠశాలల రూపురేఖలు

ABN , First Publish Date - 2022-06-29T04:27:00+05:30 IST

నాడు - నేడు పథకం ద్వారా పాఠ శాలల రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌ చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.

నాడు - నేడుతో మారిన పాఠశాలల రూపురేఖలు
అమ్మఒడి చెక్కు అందజేస్తున్న కృష్ణచైతన్య

అద్దంకి, జూన్‌ 28: నాడు - నేడు పథకం ద్వారా పాఠ శాలల రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయని  శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌ చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.   మండలంలో 3 వ విడత అమ్మ ఒడి పథకం ద్వారా 8192 మందికి  విడుదలైన రూ.12 కోట్ల 28 లక్షల 80వేల చెక్కును మంగళవారం స్థానిక శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన  కార్యక్రమంలో కృష్ణచైతన్య అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ ఒడి పథకం పేద కుటుంబాల  విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు.

అనంతరం 20వ వార్డులో  జరిగిన గడప గడపకు  మన ప్రభుత్వం కార్య క్రమంలో కృష్ణచైతన్య పాల్గొని ప్రభుత్వ పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు అందుతున్న లబ్ధిని వివరించారు. కార్యక్రమాలలో  ఎం ఈవో కోటేశ్వరరావు, నగరపంచాయతీ చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ, వైస్‌ చైర్మ న్‌లు పద్మేష్‌, అనంతలక్ష్మి, 20వ వార్డు కౌన్సిలర్‌ గుంజి  కోటేశ్వరరావు, పాఠశాల కమిటీ చైర్మన్‌ సుధాకరరెడ్డి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ జ్యోతి హనుమంతరావు, అవిశన ప్రభాకరరెడ్డి, సందిరెడ్డి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


అమ్మ ఒడి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి 

చీరాల, జూన్‌ 28: అమ్మ ఒడి సాయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. స్థానిక కేజీఎం మున్సిపల్‌ బాలికోన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కరణం బలరాం చేతుల మీదుగా అమ్మ ఒడి లబ్ధిదారులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ అర్హులైన ప్రతి విద్యార్థికి సంబం ధించి వారి తల్లిపేరున ఒమ్మఒడి నగదు జమచేశారన్నారు. ఈ సహా యాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత విద్యావంతులుగా ఎదగా లని ఆయన ఆకాంక్షించారు. అనంతరం మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల లువేసి నివాళులర్పించారు. 

కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, కమిషనర్‌ సీహెచ్‌ నాగమల్లేశ్వరరావు, ఎంఇవో పుల్లెల సుబ్రమణ్యేశ్వరరావు  తదితరులు పాల్గొన్నారు.


నాడు - నేడుతో పాఠశాలల అభివృద్ధి

పర్చూరు, జూన్‌ 28: నాడు - నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసినట్లు వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రావి రామనాథం బాబు అన్నారు.  స్థానిక అద్దంకి నాంచారమ్మ అమ్మవారి కల్యాణ మం డపం ప్రాంగణంలో మంగళవారం అమ్మ ఒడి మూడవ విడత కార్యక్ర మాన్ని ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రామనాథంబాబు మాట్లాడుతూ అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా పర్చూరు నియోజక వర్గంలో 21,106 కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. అనంతరం అమ్మ ఒడి చెక్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీదేవి, తహసీల్దార్‌ వెంకటరెడ్డి, ఎంఈవో డి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T04:27:00+05:30 IST