నేడు హౌసింగ్‌ శాఖ మంత్రి రాక

ABN , First Publish Date - 2021-07-25T05:46:31+05:30 IST

హౌసింగ్‌శాఖ మంత్రి రంగనాథరాజు ఆదివారం జిల్లా పర్యటనకు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు శ్రీశైలానికి చేరుకుంటారు.

నేడు హౌసింగ్‌ శాఖ మంత్రి రాక

కర్నూలు(కలెక్టరేట్‌), జూలై 24: హౌసింగ్‌శాఖ మంత్రి రంగనాథరాజు ఆదివారం జిల్లా పర్యటనకు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు శ్రీశైలానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. సోమవారం ఉదయం 10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు కర్నూలుకు చేరుకుంటారు. 3 నుంచి 5 గంటల వరకు సునయనలో ఇళ్ల నిర్మాణాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. జిల్లా పర్యటనను ముగించుకుని అనంతపురం జిల్లా పర్యటనకు బయలుదేరుతారు.

Updated Date - 2021-07-25T05:46:31+05:30 IST