ఓయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా

ABN , First Publish Date - 2022-09-09T16:20:51+05:30 IST

గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో ఉస్మానియా వర్సిటీ పరిధిలో శుక్రవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌

ఓయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌ సిటీ: గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో ఉస్మానియా వర్సిటీ పరిధిలో శుక్రవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ శ్రీనగేష్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వాయిదా పడిన పరీక్షల కోసం రీషెడ్యుల్‌ చేసిన టైమ్‌ టేబుల్‌ త్వరలో వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామన్నారు. ఇతర పరీక్షలను 12నుంచి షెడ్యూల్‌ ప్రకారం నిర్వహిస్తామన్నారు.

Updated Date - 2022-09-09T16:20:51+05:30 IST