‘నాడు-నేడు’ పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-02-27T05:41:21+05:30 IST

జిల్లాలో నాడు-నేడు పనులను మార్చి 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు. పాతర్లపల్లి, కోష్ట పాఠశాలల్లో జరుగుతున్న నాడు- నేడు పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు.

‘నాడు-నేడు’ పనులు పూర్తి చేయాలి
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌

రణస్థలం: జిల్లాలో నాడు-నేడు పనులను మార్చి 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు. పాతర్లపల్లి, కోష్ట పాఠశాలల్లో జరుగుతున్న నాడు- నేడు పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు.  పనులు నాణ్యతగా చేపట్టాలని ఆదేశించారు. కొచ్చెర్ల పాఠశాలలో పనులు జరగకుండా స్కూల్‌ కమిటీ ఇబ్బంది పెడుతుందని, ఆ పాఠశాల ఉపాధ్యాయుడు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పనులు అడ్డుకుంటే కమిటీని రద్దు చేస్తామని,  అక్కడి సమస్యను తెలుసుకొనేందుకు తహసీల్దార్‌ను పంపిస్తానని తెలిపారు.  కార్యక్రమంలో ప్రత్యేక అధికారి పంచాది రాధ, ఎంపీడీవో బి.శైలజ, ఎంఈవో త్రినాథరావు, ఏఈ కూర్మనాథం తదితరులు పాల్గొన్నారు.   దన్నానపేట-రణస్థలం బైపాస్‌ పనులు రద్దు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ పనులకు రైతులు సహకరించడం లేదని, దీంతో  దన్నానపేట నుంచి రావివలస వరకూ పిల్లర్లతో కూడిన వంతెన నిర్మించనున్నట్లు చెప్పారు. లావేరు:  నాడు నేడు పనులు త్వరితగతిన పూర్తి చేయా లని కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు. శుక్రవారం  లావేరులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకా లను ప్రజలకు చేరువ చేయాలని, సచివాలయ భవన నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించా రు. కార్యక్రమంలో ఎంపీడీవో బి.మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2021-02-27T05:41:21+05:30 IST