అనూహ్య ఘటన.. తల్లిపై రెండేళ్ల చిన్నారి కాల్పులు..!

ABN , First Publish Date - 2022-01-08T03:14:40+05:30 IST

కారులో దాచిన తుపాకీ చేతికి చిక్కడంతో ఓ రెండేళ్ల చిన్నారి తన తల్లి, సోదరిపై కాల్పులు జరిపాడు. మహిళ చేతిలోకి తూటా దూసుకుపోవడంతో ఆమెకు తీవ్రగాయమైంది.

అనూహ్య ఘటన.. తల్లిపై రెండేళ్ల చిన్నారి కాల్పులు..!

ఇంటర్నెట్ డెస్క్: కారులో దాచిన తుపాకీ చేతికి చిక్కడంతో ఓ రెండేళ్ల చిన్నారి తన తల్లి, సోదరిపై కాల్పులు జరిపాడు. మహిళ చేతిలోకి తూటా దూసుకుపోవడంతో ఆమెకు తీవ్రగాయమైంది. అదృష్టవశాత్తూ ఆమె కూతురికి(1) మాత్రం చిన్న గాయమే అయింది. టెక్సాన్‌లోని గ్రాన్‌బరీ ప్రాంతంలో బుధవారం ఈ ఘటన జరిగింది. సూపర్ మార్కెట్లో షాపింగ్ పూర్తి చేసుకున్న ఆ జంట పిల్లలతో కలిసి ఇంటికి బయలుదేరుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు ముందు సీట్ల మధ్యలో పిస్తోలు ఉండటంతో పిల్లాడికి అది చిక్కిందని పోలీసులు తెలిపారు. తల్లీ బిడ్డలకు ప్రాణాపాయం లేదని చెప్పారు. ప్రస్తుతం వారిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పిల్లల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు ఆ తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-01-08T03:14:40+05:30 IST