పింఛన పంపిణీ చేస్తున్న వలంటీర్‌తో కలిసి వైసీపీ కౌన్సిలర్‌ అభ్యర్థిని భర్త ప్రచారం

ABN , First Publish Date - 2021-03-02T07:27:28+05:30 IST

స్థానిక వైసీపీ నాయకులు బరితెగిస్తున్నారు. వలంటీర్లను అడ్డుపెట్టుకుని ఎన్నికల ప్రచారానికి తెరలేపా రు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఫ్యాన గుర్తుకు ఓటు వేయకపోతే పింఛన తొలగిస్తామని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.

పింఛన పంపిణీ చేస్తున్న వలంటీర్‌తో  కలిసి   వైసీపీ కౌన్సిలర్‌ అభ్యర్థిని భర్త ప్రచారం
12వ వార్డులో పింఛన పంపిణీ చేస్తున్న వలంటీర్‌తో కలసి ప్రచారం చేస్తున్న వార్డు వైసీపీ కౌన్సిలర్‌ అభ్యర్థిని భర్త

నిలదీసిన టీడీపీ నాయకులపై చిందులు 



 కళ్యాణదుర్గం, మార్చి 1: స్థానిక వైసీపీ నాయకులు బరితెగిస్తున్నారు. వలంటీర్లను అడ్డుపెట్టుకుని ఎన్నికల ప్రచారానికి తెరలేపా రు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఫ్యాన గుర్తుకు ఓటు వేయకపోతే పింఛన తొలగిస్తామని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇందుకు వలంటీర్లను పావులుగా వాడుకుని ఫోనద్వారా ఓట్లను అభ్యర్థిస్తున్నార్న ఆరోపణలున్నాయి. సోమవారం పట్టణంలోని 12వ వార్డులో వలంటీర్‌ సురేంద్ర ఇంటింటా పింఛన పంపిణీని ప్రారంభించాడు. వలంటీర్‌తో చేతులు కలిపిన ఆవార్డు వైసీపీ కౌన్సిలర్‌ అభ్యర్థిని భర్త తిరుమల వెంకటేశులు ఇంటింటికీ వెళ్ళి పింఛన అందజేస్తూ ప్రచారం చేశారు.  విషయం తెలుసుకున్న టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థిని బిక్కీ కావెలమ్మ భ ర్త వన్నూరుస్వామి ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ నాయకుడు టీడీపీ నాయకులపై చిందులు వే శా డు. నీ ఇష్టం వచ్చిన వారికి ఫిర్యాదు చేసుకొమ్మని హెచ్చరించాడు. ఈక్రమంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహారం కాస్త సోషల్‌ మీడియాకి ఎక్కి వైరల్‌ అయ్యింది. 


గోళ్ల గ్రామ సచివాలయం ముట్టడి 

కళ్యాణదుర్గం, మార్చి 1: ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతు సర్పంచ అభ్యర్థికి ఓటు వేయలేదన్న నెపంతో టీడీపీ సానుభూతిపరులకు పింఛన పంపిణీకి నిరాకరించారు. సోమవారం మండలంలోని గోళ్ళ గ్రామంలో ఈ వివాదం తలెత్తింది. ఏకంగా 72 మంది లబ్ధిదారులకు పింఛన ఇవ్వకుండా గ్రామ వలంటీర్లు ఎగనా మం పెట్టారు. ప్రతినెలా అందే పింఛన ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని లబ్ధిదారులు వలంటీర్లను నిలదీసారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ కవిత, మాజీ వైస్‌ ఎంపీపీ వెంకటేశులు, రమేష్‌, బొ జ్జన్న, వెంకటేశులు తదితరులు లబ్ధిదారులతో కలిసి గ్రామ సచివాలయాన్ని ముట్టడించారు. గంటపాటు బైఠాయించి ఆందోళన చేపట్టా రు. పింఛన్ల పంపిణీలో కుట్రపూరిత రాజకీయాలు చేయడం దౌర్భాగ్యమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ పథకాలు అర్హత ఉన్న పే దలకు సక్రమంగా అందేలా ఉద్యోగులు బాధ్యత వహించాలని డి మాండ్‌ చేశారు. జరుగుతున్న అన్యాయంపై గ్రామ కార్యదర్శులను నిలదీసే ప్రయత్నం చేశారు. కంగుతిన్న సచివాలయ సిబ్బంది ఉన్న తాధికారులతో చర్చించారు. మధ్యాహ్నం యథావిధిగా లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేయడంతో వివాదం సద్దుమనిగింది. 

Updated Date - 2021-03-02T07:27:28+05:30 IST