తిరుపతిలో రేపు సర్వదర్శన టోకెన్ల జారీ

Published: Sun, 13 Feb 2022 19:49:25 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తిరుపతిలో రేపు సర్వదర్శన టోకెన్ల జారీ

తిరుమల: కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు గతంలో నిలిపివేసిన శ్రీవారి సర్వదర్శన ఆఫ్‌లైన్‌ టోకెన్ల జారీని 15వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. 16వ తేదీ దర్శనం కోసం 15వ తేదీ ఉదయం 9 గంటలకు టోకెన్లు జారీ చేస్తారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం కాంప్లెక్స్‌, శ్రీగోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసే కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి టోకెన్లు పొందాలని టీటీడీ కోరింది. రోజుకు 10 వేల టోకెన్ల చొప్పున జారీ చేయనున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.