ఎమర్జెన్సీ దిశగా జపాన్.. టోక్యో మోటార్ షో రద్దు

ABN , First Publish Date - 2021-04-23T00:54:17+05:30 IST

దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండడం, మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో

ఎమర్జెన్సీ దిశగా జపాన్.. టోక్యో మోటార్ షో రద్దు

టోక్యో: జపాన్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండడం, మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ‘మోటార్ షో’ను రద్దు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. టోక్యోలో మూడోసారి ఎమర్జెన్సీ విధించడంతోపాటు మరికొన్ని ఆంక్షలతో రెండు వారాలపాటు అమలు చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, టోక్యో ఒలింపిక్స్ పైనా నీలి నీడలు కమ్ముకున్నాయి.


జపాన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ చైర్మన్ అకియో టోయోడో మాట్లాడుతూ.. పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అందరికీ సురక్షిత వాతావరణం కల్పించడం అసాధ్యమని, కాబట్టి ఆటో షోను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. అక్టోబరు చివరిలో కానీ, నవంబరు మొదట్లో కానీ ఆటో షో నిర్వహిస్తామని పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-23T00:54:17+05:30 IST