జీవితాంతం పిజ్జా ఫ్రీ

ABN , First Publish Date - 2021-07-26T08:57:20+05:30 IST

ఒలింపిక్స్‌లో వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి రజతం సాధించడంతో యావత్‌ భారతావని సంబరాలు చేసుకుంది. పతకం నెగ్గిన తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ

జీవితాంతం పిజ్జా ఫ్రీ

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి రజతం సాధించడంతో యావత్‌ భారతావని సంబరాలు చేసుకుంది. పతకం నెగ్గిన తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ గురించి విలేకరులతో మీరా మాట్లాడింది. ముందుగా ఇంటికెళ్లి అమ్మానాన్నలను కలుసుకోవడంతోపాటు మరికొన్ని విషయాలు కూడా చెప్పింది. అయితే, నోరూరించే పిజ్జా కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు చెప్పడం ఎక్కవగా ఆకర్షించింది.  ‘ముందుగా వెళ్లి పిజ్జాను లాగించేస్తా. తిని ఎన్నో రోజులైంది. ఆరోజు చాలా తింటా’ అని చాను చెప్పింది. పిజ్జా కోసం తహతహలాడి పోతున్నానని చాను చెప్పిన వెంటనే.. డామినోస్‌ స్పందించింది. మీరాకు శుభాకాంక్షలు చెబుతూనే.. జీవితాంతం ఆమెకు ఉచితంగా పిజ్జాను అందజేయనున్నట్టు ప్రకటించింది. 

Updated Date - 2021-07-26T08:57:20+05:30 IST