నిర్లక్ష్యం చేస్తే సహించం

ABN , First Publish Date - 2022-01-23T06:46:29+05:30 IST

జిల్లాలో ఫీవర్‌ సర్వే పకడ్బందీగా చేపట్టాలి. సమగ్ర వివరాలు సేకరించాలి. లక్షణాలు తీవ్రంగా ఉన్నవారి ని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలి. అధికారులు ఫీవర్‌ సర్వే పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండ పూర్తిస్థాయిలో నిర్వహించాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

నిర్లక్ష్యం చేస్తే సహించం
కిట్‌ను చూపుతున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ఫీవర్‌ సర్వేలో ఇంటింటా పూర్తి వివరాలు సేకరించాలి
లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిని ఆసుపత్రికి తరలించాలి
దళితబంధును పకడ్బందీగా అమలు చేయాలి
అధికారుల సమీక్షలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్‌, జనవరి 22(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఫీవర్‌ సర్వే పకడ్బందీగా చేపట్టాలి. సమగ్ర వివరాలు సేకరించాలి. లక్షణాలు తీవ్రంగా ఉన్నవారి ని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలి. అధికారులు ఫీవర్‌ సర్వే పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండ పూర్తిస్థాయిలో నిర్వహించాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం అధికారులతో ఫీవర్‌ సర్వే, దళితబంధు, ఇతర అంశాలపై సమీక్షించారు. కొవిడ్‌ 3వ వేవ్‌ను ఎదుర్కోనేందుకు అన్ని ఏర్పాట్లను చేశామన్నారు. జిల్లా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లా ఆసుపత్రితో పాటు అన్ని ఆసుపత్రుల్లో బెడ్స్‌ను సిద్ధం చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జ్వరాలు, కరోనా కేసులు పెరగడం వల్లనే ప్రభుత్వం ఈ ఫీవర్‌ సర్వే చేపట్టిందన్నారు. అన్ని గ్రామాలు, మున్సిపాలిటిల పరిధిలో ఈ సర్వేను నిర్వహిస్తున్నామన్నారు. సర్వే బృందం సభ్యులు తప్పనిసరిగా ఇటింటిటా తిరగాలన్నారు. గత సంవత్సరం చేసిన ఫీవర్‌ సర్వేలాగానే ఈ దఫా కూడా చేయాలన్నారు. జ్వరాలు, ఇతర సమస్యలతో బాధపడుతున్నవారిని గుర్తించి తగిన మందులు ఇవ్వాలన్నారు. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉంటే హోం ఐసొలేషన్‌ కిట్లను ఇచ్చి ఏడు రోజుల పాటు బయటకి రాకుండ చూడాలన్నారు. కరోనా తీవ్ర  లక్షణాలు ఉన్నవారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు.
అలాగే, సీఎం కేసీఆర్‌ అట్టడువర్గాలను ఆదుకునేందుకు దళితబంధు కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి అన్నారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పకడ్బందిగా అమలు చేయాలన్నారు. పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేయాలన్నారు. దళితబంధు లబ్దీదారులను ఎంపిక చేయడంతో పాటు వారికి ఏ రంగాల్లో పరిణతి ఉందో ఆ రంగాల్లో తగిన శిక్షణ అందించాలన్నారు. వారికి తగిన ఆర్థిక సహాయం అందించడంతో పాటు స్వశక్తితో నిలబడేవిధంగా చూడాలన్నారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి వందమందిని ఈ దళితబంధు పథకం కింద ఎంపిక చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇతర అంశాలపైన కూడా మంత్రి అధికారులతో సమీక్షించారు. సమావేశంలో జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు, ఇతర శాఖల అదికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T06:46:29+05:30 IST