Tollywood Young Hero : ఫామ్‌హౌజ్‌లో పేకాట కేసులో కీలక అప్డేట్..!

ABN , First Publish Date - 2021-11-03T18:03:31+05:30 IST

Tollywood Young Hero ఫామ్‌హౌజ్‌లో పేకాట కేసులో కీలక అప్డేట్..!

Tollywood Young Hero : ఫామ్‌హౌజ్‌లో పేకాట కేసులో కీలక అప్డేట్..!

  • పేకాట రాయుళ్లకు బెయిలు
  • ప్రధాన సూత్రధారికి జైలు
  • సుమన్‌కు రెండు రోజుల పోలీస్‌ కస్టడీ 
  • ఫోన్‌లు స్విచాఫ్‌ చేసిన.. హీరో, ఆయన తండ్రి
  • నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైన పోలీసులు

హైదరాబాద్‌ సిటీ : నార్సింగి పరిధిలో సినీ హీరో ఫామ్‌హౌజ్‌లో పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిన ముఠాలో 29మందికి బెయిల్‌ మంజూరైంది. వారిలో మహబూబాబాద్‌ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్‌ భద్రయ్య, రియల్టర్‌లు, వ్యాపారులు ఉన్నారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం వారం రోజులు పోలీస్‌ కస్టడీకి ఇవ్వాల్సిందిగా నార్సింగి పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. 29మందికి మంగళవారం బెయిల్‌ మంజూరు చేసిన ఉప్పర్‌పల్లి కోర్టు ప్రధాన నిందితుడు సుమన్‌కు బెయిల్‌ నిరాకరించింది. రెండు రోజులు పోలీస్‌ కస్టడీకి ఇస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే గుత్తా సుమన్‌పై కూకట్‌పల్లి, గచ్చిబౌలి, పంజాగుట్ట, విజయవాడ పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదైనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. భూ కబ్జాలు, బెదిరింపులు, ఉద్యోగం మోసాలు, పేకాట, క్యాసినో బెట్టింగ్‌ దాందా చేశాడని గుర్తించినట్లు తెలిసింది.


ఫోన్‌ స్విచాఫ్‌ చేసిన హీరో.. 

ప్రధాన నిందితుడు సుమన్‌ ప్రముఖ యువ కథానాయకుడికి మంచి పరిచయం ఉన్నట్లు తెలిసింది. చిన్న గెట్‌టుగెదర్‌ పార్టీ ఉందని, ఒక్కరోజు ఫామ్‌హౌజ్‌ను ఉపయోగించుకుంటానని కోరడంతో అందుకు ఆయన అంగీకరించి అతనికి అనుమతిచ్చాడు. దీంతో సుమన్‌ తన అనుచరులను, పేకాట రాయుళ్లను రప్పించి జూదం నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఓ మాజీ అధికారికి చెందిన ఈ ఫామ్‌హౌజ్‌ హీరో తన తండ్రి పేరుతో లీజ్‌కు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ లీజ్‌ అగ్రిమెంట్స్‌ పత్రాలు తీసుకొచ్చి చూపించాలని నార్సింగి పోలీసులు హీరో తండ్రికి సమాచారం ఇచ్చారు. కానీ యువ హీరో గానీ, ఆయన తండ్రి గానీ స్పందించలేదు. ఇద్దరి ఫోన్లు స్విచాఫ్‌ చేసి పెట్టారని పోలీసులు పేర్కొన్నారు. సకాలంలో స్పందించకపోతే నోటీసులు అందజేస్తామని, అయినా స్పందించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. 

Updated Date - 2021-11-03T18:03:31+05:30 IST