HYD : ఆరేళ్లుగా సహజీవనం.. Lover మోసం చేశాడని Tollywood జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-09-30T14:43:43+05:30 IST

ప్రేమించాడు.. ఆరేళ్లు సహజీవనం చేశాడు. పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి...

HYD : ఆరేళ్లుగా సహజీవనం.. Lover మోసం చేశాడని Tollywood జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య

హైదరాబాద్ సిటీ : ప్రేమించాడు.. ఆరేళ్లు సహజీవనం చేశాడు. పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ప్రియుడు కాదన్నాడని ఆత్మహత్య చేసుకుంది ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌. నగరానికి చెందిన జూనియర్‌ ఆర్టిస్ట్‌ కావలి అనురాధ(22)కు కొద్ది కాలం క్రితం కిరణ్‌ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఫిలింనగర్‌ జ్ఞానీజైల్‌సింగ్‌ నగర్‌లో గది అద్దెకు తీసుకొని ఆరేళ్లు సహజీవనం చేశారు. మూడు నెలల్లో పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఇంతలో కిరణ్‌ ముఖం చాటేశాడు. అతడి ఫోన్‌ కూడా పనిచేయలేదు. మోసపోయానని గ్రహించిన అనురాధ ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుంది. రెండు రోజుల తరువాత గదిలో నుంచి దుర్వాసన వస్తుండటంతో తెరిచి చూడగా కుళ్లిపోయిన స్థితిలో ఆమె మృతదేహం ఉంది. అనురాధ సోదరి ఉప్పు సరోజ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కిరణ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-09-30T14:43:43+05:30 IST