ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు : స్పైడర్ మ్యాన్

Published: Fri, 28 Jan 2022 12:02:21 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు : స్పైడర్ మ్యాన్

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ ఎంత పెద్ద హిట్ సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ కలెక్షన్ల సునామిని సృష్టించింది. ఎన్నో ఆంక్షల మధ్య విడుదలై ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.12 వేల కోట్లను కొల్లగొట్టింది. ఇందులో స్పైడర్ మ్యాన్ పాత్రలో అదరగొట్టిన టామ్ హోలాండ్ ఈ సినిమా గురించి తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


ఓ ఇంటర్వ్యూలో టామ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన అందుకుంటుందని నాకు ముందే తెలుసు. కానీ మరీ వేల కోట్లు కొల్లగొట్టి ఇంత భారీ విజయాన్ని అందుకంటుందని ఊహించలేదు. ఆన్‌లైన్‌లో ప్రేక్షకుల స్పందన తెలుసుకున్నప్పుడు ఒక సీన్ కోసమే ఈ మూవీని చూడడానికి వచ్చారనే విషయం అర్థమయ్యింది’ అని చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు : స్పైడర్ మ్యాన్

కాగా, ఈ ‘నో వే హోమ్’ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి 27వ మూవీగా వచ్చింది. అయితే ఈ సినిమాలో గతంలో స్పైడర్ మ్యాన్ పాత్రల్లో నటించిన ఆండ్ర్యూ గార్‌ఫీల్డ్, టోబే మాగ్వైర్‌ ప్రత్యేక పాత్రలో నటించనున్నారని ఈ సినిమా విడుదలకి ముందు జోరుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే మూవీ టీం ఈ విషయాన్ని రూమర్‌గా కొట్టి పారేసింది. కానీ నిజంగా వారిద్దరూ నటించడంతో థియేటర్స్‌లో సినిమాని చూసేందుకు ప్రేక్షకులు క్యూ కట్టారు. దీంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీస్‌లో ఆరో స్థానంలో నిలిచింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International