రేపటి నుంచి అర్ధవార్షిక సెలవులు

ABN , First Publish Date - 2021-12-24T18:28:32+05:30 IST

రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 25 నుంచి జనవరి 2వ తేదీ వరకు అర్ధ వార్షిక సెలవులు ప్రకటిస్తున్నట్టు పాఠ శాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ తెలిపారు. తిరునల్వేలి జిల్లాలో ముగ్గురు విద్యార్థుల

రేపటి నుంచి అర్ధవార్షిక సెలవులు

                               - మంత్రి అన్బిల్‌ మహేష్‌


పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 25 నుంచి జనవరి 2వ తేదీ వరకు అర్ధ వార్షిక సెలవులు ప్రకటిస్తున్నట్టు పాఠ శాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ తెలిపారు. తిరునల్వేలి జిల్లాలో ముగ్గురు విద్యార్థుల ప్రాణాలు బలిగొన్న పాఠశాల ప్రాంగణాన్ని గురువారం మంత్రి జిల్లా అధికారులతో కలసి పరిశీలించారు. అనంతరం మృతి చెందిన విద్యార్థుల ఇళ్లకు నేరుగా వెళ్లిన మంత్రి, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులను ఓదార్చారు. ఇళ్లలో ఏర్పాటు చేసిన విద్యార్థుల చిత్రపటాలకు మంత్రి పూలుచల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం పాఠశాలలు యధావిధిగా నడుస్తున్నాయని, అందువల్ల శనివారం నుంచి జనవరి 2వ తేదీ వరకు అర్ధవార్షిక సెలవులు ప్రకటిస్తున్నామన్నారు. విద్యార్థులు బస్సు ఫుట్‌బోర్డులపై ప్రయాణించడాన్ని అడ్డుకొనేలా చర్యలు చేపట్టామన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో అధికారులు, పోలీసులు బస్టాండులను పర్యవేక్షిస్తూ విద్యార్థులను క్యూలైన్‌లో బస్సులోకి ఎక్కించేలా చర్యలు చేపట్టామన్నారు. అలాగే, బస్సు ద్వారాలకు డోర్లు వేసే చర్యలపై కూడా దృష్టి సారించామని తెలిపారు. పాఠశాల ముగిసిన వెంటనే విద్యార్థులందరూ ఒక్కసారిగి బయటకు రావడంతో రద్దీ నెలకొంటుందని, దానిని అడ్డుకొనేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని ఉత్తర్వులు జారీచేశామని మంత్రి తెలిపారు.

Updated Date - 2021-12-24T18:28:32+05:30 IST