రేపటినుంచి అగ్ని నక్షత్రం ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-03T13:20:36+05:30 IST

రాష్ట్రంలో వేసవి సీజన్‌ ప్రారంభానికి ముందే ఎండ తీవ్రత పెరిగింది. సోమవారం 13 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదుకాగా, కాంచీపురం జిల్లాల్లో

రేపటినుంచి అగ్ని నక్షత్రం ప్రారంభం

- ఇక సెగలే...! 

- 28 రోజులు తప్పని ఎండ తీవ్రత


పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో వేసవి సీజన్‌ ప్రారంభానికి ముందే ఎండ తీవ్రత పెరిగింది. సోమవారం 13 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదుకాగా, కాంచీపురం జిల్లాల్లో అత్యధికంగా 43 డిగ్రీలు దాటింది. ఈ నేపధ్యంలో, వేసవి సీజన్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అగ్ని నక్షత్రం ఈ నెల 4వ తేది ప్రారంభమై 28 రోజులు కొనసాగనుంది. సాధారణంగా అగ్ని నక్షత్రంగా పిలువబడే రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయని పెద్దలు చెబుతుంటారు. ఈ సమయంలో సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం 8.30 నుంచే ప్రారంభమవుతున్న ఎండ తీవ్రత సాయంత్రం 4.30 గంటల వరకు తగ్గడం లేదు. సోమవారం తిరుత్తణి, వేలూరులో 42 డిగ్రీలు, సేలం, మదురై, కరూర్‌ పరమత్తిలో 40, సేలం, ఈరోడ్‌, మాధవరంలలో 39, చెన్నై విమానాశ్రయం, ధర్మపురి, తంజావూరు, తిరునల్వేలిలలో 38 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యవసర పనులకు బయటకు వెళ్లే వారు మజ్జిగ, శీతల పానీయాలు సేవించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read more