రేపు ‘Tamilnadu Day’ వేడుకలు

ABN , First Publish Date - 2022-07-17T16:19:11+05:30 IST

తమిళనాడు సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలైవానర్‌ అరంగంలో సోమవారం ‘తమిళనాడు డే’ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్యమం

రేపు ‘Tamilnadu Day’ వేడుకలు

                    - హాజరుకానున్న సీఎం స్టాలిన్‌


ప్యారీస్‌(చెన్నై), జూలై 16: తమిళనాడు సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలైవానర్‌ అరంగంలో సోమవారం ‘తమిళనాడు డే’ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ హాజరుకానున్నారు. ఈ మేరకు సచివాలయం శనివారం విడుదల చేసిన ప్రకటనలో, కలైవానర్‌ అరంగంలో సోమవారం ఉదయం 11.30 గంటలకు సీఎం స్టాలిన్‌ అధ్యక్షతన జరుగనున్న వేడుకల్లో రాష్ట్రస్థాయి సాహిత్య, కంఠస్థ పోటీల్లో గెలుపొందిన పాఠశాల, కళాశాలల విద్యార్థులకు బహుమతులు, తమిళాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో తిరువిక, కబిలర్‌, ఊవేసా, కారైకాల్‌ అమ్మయార్‌ పేర్లతో అవార్డులు ప్రదానం చేయనున్నారు. మెరీనా బీచ్‌లో రూపొందించనున్న సైకత శిల్పం, కలైవానర్‌ అరంగంలో తమిళనాడు డేకు సంబంధించి ఫొటోలతో కూడిన ప్రత్యేక ప్రదర్శనను ప్రజలు ఈ నెల 20వ తేది వరకు వీక్షించవచ్చని రాష్ట్రప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2022-07-17T16:19:11+05:30 IST