పడిపోయిన టమోటా ధర.. నిరాశలో రైతులు

ABN , First Publish Date - 2021-09-18T18:09:20+05:30 IST

టమోట ధరలు సాధారణ ధర కు చేరుకుందని రైతులు ఆశించేలోపే రైతులకు నిరాశే మిగిలింది. నెల రోజులుగా టమోట ధరలు సాధారణంగా బాక్సు రూ.300 నుంచి 400 దాక ధర పలికింది. టమోట పంటలు

పడిపోయిన టమోటా ధర.. నిరాశలో రైతులు

హోసూరు(కర్ణాటక): టమోట ధరలు సాధారణ ధర కు చేరుకుందని రైతులు ఆశించేలోపే రైతులకు నిరాశే మిగిలింది. నెల రోజులుగా టమోట ధరలు సాధారణంగా బాక్సు రూ.300 నుంచి 400 దాక ధర పలికింది. టమోట పంటలు పండించిన రైతులు ఆనందించిలోపే గతవారం రోజులుగా టమోట ధర బాక్సు రూ.100కు పడిపోయింది. ప్రస్తుతం టమోటా బాక్సు ధర రూ.100 - 150 వరకు ధర పలుకుతోంది. సెప్టెంబరు నెలలో టమోట ధరలు పెరుగుతాయని కృష్ణగిరి జిల్లావ్యాప్తంగా సుమా రు 2వేల ఎకరాలలో రైతులు టమోట పంట వేశారు. ప్రస్తుతం పంట చేతికొచ్చేసరికి ధరలు తీవ్రగా పడిపోయాయి. చాలా మంది రైతులు సుమారు టమోట పండించడానికి ఎకరానికి లక్షకుపైగా ఖర్చు చేశారు. అయితే గిట్టుబాటు ధర రాకపోయేసరికి రైతులు తీవ్ర దిగ్ర్భాంతికి గురైయ్యారు. కొంతమంది రైతులు మాత్రం పండించిన టమోటా పంటను తోట్లల్లోనే వదిలేశారు. కృష్ణగిరి జిల్లాలో డెంకణీకోట, తళి, అంచెట్టి, ఉద్దనపల్లి, సూళగిరి ప్రాంతాల్లో బోరుబావుల్లో నీరు అంతంతమాత్రమే ఉండడంతో రైతులు ఆశించి ధరలు పెరుగుతాయని ఊహించి టమోటాపంట వేశారు. సాధారణధర కూడా పలకకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. 


Updated Date - 2021-09-18T18:09:20+05:30 IST