కేరళలో మిస్టరీ వ్యాధి.. Tomato Flu.. ఇప్పటివరకు..

ABN , First Publish Date - 2022-05-11T22:42:52+05:30 IST

తిరువనంతపురం : కొత్త కొత్త ఫ్లూలు, వైరస్‌లు ముందుగా వెలుగుచూసే కేరళలో మరో కొత్త ఫ్లూ బయటపడింది. రాష్ట్రంలో ఇటివల ఫుడ్ పాయిజనింగ్ ఘటనల్లో మరో కొత్త వైరస్ ‘టమాటా ఫ్లూ’ను గుర్తించినట్టు అక్కడి వైద్యశాఖ పేర్కొంది

కేరళలో మిస్టరీ వ్యాధి.. Tomato Flu.. ఇప్పటివరకు..

తిరువనంతపురం : కొత్త కొత్త ఫ్లూలు, వైరస్‌లు ముందుగా వెలుగుచూసే కేరళలో మరో ఫ్లూ బయటపడింది. రాష్ట్రంలో ఇటివల ఫుడ్ పాయిజనింగ్ ఘటనల్లో కొత్త వైరస్ ‘టమాటా ఫ్లూ’ను గుర్తించినట్టు అక్కడి వైద్యాధికారులు పేర్కొన్నారు. మీడియా రిపోర్టుల ప్రకారం.. అరుదైన ఈ వైరల్ వ్యాధి 5 ఏళ్లలోపు పిల్లలకు సోకుతోంది. ఇప్పటికే 80కిపైగా మంది పిల్లలకు వ్యాపించి ఆసుపత్రి పాలవుతున్నారు. కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయి. కొల్లాంలోనే కేసుల సంఖ్య అధికంగా ఉంది. కాగా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా కేరళ దక్షిణ ప్రాంతమైన అర్యాంకవు, అంచల్, నెడువత్తుర్‌లలో కూడా కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకుగానూ జ్వరం, దద్దుర్లు, ఇతర లక్షణాలతో కోయంబత్తూర్ వచ్చేవారికి తమిళనాడు-కేరళ సరిహద్దులో వలయార్ వద్ద మెడికల్ బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ప్రయాణికులు.. ముఖ్యంగా పిల్లలను పరిశీలించేందుకు ఇద్దరు ప్రత్యేక వైద్యాధికారులను నియమించారు. అంతేకాకుండా అంగన్‌వాడీ కేంద్రాల వద్ద తనిఖీల కోసం కూడా 24 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.


టమాటా ఫ్లూ అంటే ఏమిటీ?.. లక్షణాలు ఏవి?

టమాటా ఫ్లూ ఒక అంతుచిక్కని వైరల్ వ్యాధి. పిల్లల శరీరంపై ఎర్రటి రంగులో దద్దుర్లు, బొబ్బలతోపాటు తీవ్రమైన జ్వరం వస్తున్నాయి. అంతేకాకుండా దురద, డీహైడ్రేషన్‌, దగ్గు, తుమ్ములు, ముక్కుకారడం, కాళ్లు-చేతుల రంగుమారడం, ఒళ్లు నొప్పులు, కీళ్ల వాపులు, అలసట లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు చికెన్ గున్యా మాదిరిగానే ఉన్నాయి. పిల్లల శరీరంపై వస్తున్న దద్దుర్లు టమాటా మాదిరిగా ఉంటున్నాయి. అందుకే ఈ వ్యాధికి టమాటా వైరస్ అని పేరు పెట్టారు. అంతుచిక్కని ఈ వ్యాధి నియంత్రణకు పరిశుభ్రత చాలా ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Read more