టొమాటో కాధా మసాలా షోర్బా

ABN , First Publish Date - 2021-05-15T17:18:30+05:30 IST

కొవిడ్‌ను ఎదుర్కోవాలంటే ఇమ్యూనిటీ ఉండాలి. మరి ఇమ్యూనిటీ పెరగాలంటే మంచి డైట్‌ ఉండాల్సిందే. టొమాటో కాధా మసాలా షోర్బా, నాన్‌ వెజ్‌ రెసిపీలైన మరాక్‌, ముర్గ్‌ మలాయి కబాబ్‌

టొమాటో కాధా మసాలా షోర్బా

ఇమ్యూనిటీ వంటకాలు తిందామా

కొవిడ్‌ను ఎదుర్కోవాలంటే ఇమ్యూనిటీ ఉండాలి. మరి ఇమ్యూనిటీ పెరగాలంటే మంచి డైట్‌ ఉండాల్సిందే. టొమాటో కాధా మసాలా షోర్బా, నాన్‌ వెజ్‌ రెసిపీలైన మరాక్‌, ముర్గ్‌ మలాయి కబాబ్‌, చాట్‌పటి మచ్చీ, హైదరాబాద్‌ దమ్‌ కా ముర్గ్‌ ఆ కోవకు చెందినవే. వాటి రుచులను మీరూ ఆస్వాదించండి.


కావలసినవి: టొమాటో - 300గ్రా, క్యారెట్‌ - 100గ్రా, వెల్లుల్లి - 50గ్రా, కొత్తిమీర వేళ్లు - కొద్దిగా, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి - 30గ్రా, ఉల్లిపాయలు - 100గ్రా, నూనె - సరిపడా, యాలకులు - 30గ్రా, లవంగాలు - 30గ్రా, దాల్చిన చెక్క - 30గ్రా, సాజీరా - 30గ్రా.


తయారీ విధానం: క్యారెట్‌, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేళ్లని ముక్కలుగా తరగాలి. ఫ తరువాత వాటిని ఒక పాత్రలో తీసుకుని, తగినన్ని నీళ్లు పోసి స్టవ్‌పై పెట్టి ఉడికించాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, సాజీర వేసి నీళ్లు సగం ఇంకే వరకు మరిగించాలి. తరువాత వడగట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఫ స్టవ్‌పై పాన్‌ పెట్టి టొమాటో ముక్కలు వేసి చిన్నమంటపై వేగించాలి. ఇప్పుడు టొమాటో ప్యూరీని, మరిగించి వడగట్టి పెట్టుకున్న మిశ్రమంలో కలపాలి. మరికాసేపు ఉడికించాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-05-15T17:18:30+05:30 IST