ట‘మోత’!

ABN , First Publish Date - 2022-05-24T06:24:15+05:30 IST

ట‘మోత’!

ట‘మోత’!
రైతు బజారులో టమాటాలు అమ్ముతున్న రైతు

సెంచరీకి చేరిన టమాట ధర..వినియోగదారుల గగ్గోలు
ఏలూరు టూటౌన్‌, మే 23: సామాన్యుడి నుంచి అన్ని వర్గాల వారు రోజూ కూరల్లో విని యోగించే టమాటా కేజీ ధర వంద రూపాయలకు  చేరువైంది. దీంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. టమాట ధరలను నియంత్రించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధార ణంగా కేజీ టమాట రూ.10 నుంచి 20 పలికేది. నెల నుంచి రూ. 30, 50 పెరుగుతూ ఇప్పుడు బహిరంగ రిటైల్‌ మార్కెట్‌లో రూ.100కు చేరింది. హోల్‌సేల్‌ ధర రూ.80 పైమాటే. ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా కేజీకి రూ.15 తక్కువకు అమ్ముతామని ప్రకటించింది. మహారాష్ట్ర నుంచి దిగు మతి చేసుకుని శని, ఆదివారాల్లో 2800 కేజీలు సరఫరా చేసింది. వీటిలో 500 కేజీలు కుళ్లిపోయాయి. మిగిలినవి కేజీ రూ.72 చొప్పున అమ్మారు. ఇంకా టమాటాలు దిగుమతి చేసుకునే పరిస్థితిలేదు. స్థానికంగా టమాటా పంట సీజన్‌ ముగిసిపోయింది. ఇప్పుడు పంటలు వేసిన ఎండలకు బతకవు. వర్షాలు వచ్చి పంటలు వేసి దిగుమతి వచ్చే వరకు పరిస్థితి ఇలానే కొనసాగేలా ఉంది. టమాట ధరలను నియంత్రించాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.


Updated Date - 2022-05-24T06:24:15+05:30 IST