టమోటా.. పైపైకి

ABN , First Publish Date - 2022-05-21T08:21:06+05:30 IST

టమోటా ధరలు పైపైకి దూసుకెళ్తున్నాయి.

టమోటా.. పైపైకి
రామకుప్పం మినీమర్కెట్‌లో వచ్చిన టమోటాలు

15 కిలోల బాక్సు ధర రూ.1250 

రీటైల్‌ మార్కెట్‌లో రూ.85 నుంచి రూ.110 వరకు 


రామకుప్పం, మే 20: టమోటా ధరలు పైపైకి దూసుకెళ్తున్నాయి. 15కిలోల బాక్సు ధర శనివారం  గరిష్ఠంగా రూ.1250 పలికింది. రామకుప్పం, వి.కోట, కుప్పం, ఏడోమైలు మార్కెట్లలో నాణ్యతను బట్టి రూ.950 నుంచి రూ.1250 వరకు కొన్నారు. హోల్‌సేల్‌ మార్కెట్లలో కిలో టమోటా ధర రూ.70 నుంచి రూ.88 పలకగా, రీటైల్‌ మార్కెట్‌లో నాణ్యతను బట్టి కిలో రూ.85 నుంచి రూ.110 వరకు విక్రయిస్తున్నారు. చిన్నసైజు టమోటాలు, మచ్చలకాయలకు కూడా మంచి ధర వచ్చింది. ఒక్కో బాక్సు రూ.550 నుంచి రూ.650 వరకు పలికింది. ఒకపక్క మండుటెండలు, మరోపక్క ఎడ తెరపిలేని వర్షాల కారణంగా దిగుబడి తగ్గడం, తమిళనాడు, కర్ణాటకల్లో గణనీయంగా సాగు విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల టమోటాలకు డిమాండు పెరుగుతోందని వ్యాపారులు అంటున్నారు. 

Updated Date - 2022-05-21T08:21:06+05:30 IST