టమోటా ట్రాక్టర్‌ బోల్తా..నేలపాలైన కాయలు

ABN , First Publish Date - 2022-06-29T05:33:46+05:30 IST

టమోటా లోడుతో వెళుతున్న ఓ ట్రాక్టర్‌ అదుపు తప్పి రోడ్డుపక్కనున్న విద్యుత్‌ స్తంభా న్ని ఢీకొట్టి బోల్తాపడింది.

టమోటా ట్రాక్టర్‌ బోల్తా..నేలపాలైన కాయలు
నేలపాలైన కాయలు

మదనపల్లె క్రైం, జూన్‌ 28: టమోటా లోడుతో వెళుతున్న ఓ ట్రాక్టర్‌ అదుపు తప్పి రోడ్డుపక్కనున్న విద్యుత్‌ స్తంభా న్ని ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటన లో డ్రైవర్‌ స్వల్పంగా గాయపడగా, టమోటాలన్నీ నేలపాలయ్యాయి. మంగళవారం మదనపల్లె మండలం లోని పెంచుపాడు గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి తన వ్యవసాయ పొలంలో కోసిన టమోటాలను క్రేట్లలో నింపి ట్రాక్టర్‌లో మదనపల్లె మార్కెట్‌కు తరలిస్తుండగా దారిలో దండువారిపల్లె వద్ద  ట్రాక్టర్‌ అదుపుతప్పి రోడ్డుపక్కనున్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. ప్రమాదంలో వాహన డ్రైవర్‌ బాబు(34)స్వల్పంగా గాయపడ్డాడు. అలాగే ట్రాక్టర్‌ ఇంజన్‌ ధ్వంసం కాగా, ట్రాలీలోని క్రేట్లు కిందపడడంతో కాయలన్నీ నేలపాలయ్యాయి. టమోటాకు బాగా ధరలున్న నేపథ్యంలో ఘటనలో రూ.1.50 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ట్రాక్టర్‌ నడిరోడ్డుపై బోల్తాపడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్థానికులు అక్కడికి చేరుకుని ట్రాక్టర్‌ను, క్రేట్లను పక్కకు తొలగించడంతో సమస్య పరిష్కారమైంది. అనంతరం డ్రైవర్‌ను జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసునమోదు చేసినట్లు తాలూకా పోలీసులు చెప్పారు.

Updated Date - 2022-06-29T05:33:46+05:30 IST