Advertisement

రేపు మహబూబ్‌నగర్‌ ఆవిర్భావ దినోత్సవం

Dec 2 2020 @ 22:52PM

 మహబూబ్‌నగర్‌టౌన్‌, డిసెంబరు 2:  ఆరో నిజాం నవాబ్‌ మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ బ హుదూర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 4న జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో 130వ మహబూబ్‌నగర్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఫౌండేషన్‌ వ్యవ స్థాపక అధ్యక్షుడు మీర్‌ షోయబ్‌ అలీ, కార్యదర్శి ఎస్‌.ఎం.ఖలీల్‌ నాగభూషణం, కుతు బు ద్దీన్‌, అబ్దుల్‌ రహ్మన్‌రాజ్‌, ఎండీ సుల్తాన్‌, ఎండీ ఉస్మాన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పదిహేనేళ్లుగా మహబూబ్‌నగర్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభ వంగా నిర్వహిస్తున్నామని, కొవిద్‌-19 నిబంధనల నేపథ్యంలో ఈయేడాది పరిమితంగా కార్య క్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ముఖ్య అతిథిగా ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌, అన్ని మతాల పెద్దలు, రాజకీయ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. 

Follow Us on:
Advertisement