రేపు GHMC బడ్జెట్‌.. రూ.6556.70 కోట్లుగా ప్రతిపాదన

ABN , First Publish Date - 2022-03-15T14:16:13+05:30 IST

2022-23 ఆర్ధిక సంవత్స రానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ రేపు స్టాండింగ్‌,..

రేపు GHMC బడ్జెట్‌.. రూ.6556.70 కోట్లుగా ప్రతిపాదన

హైదరాబాద్‌ సిటీ : 2022-23 ఆర్ధిక సంవత్స రానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ రేపు స్టాండింగ్‌ కమిటీ ముందుకు వచ్చే అవకాశముందని ఆర్ధిక విభాగం వర్గాలు చెబుతున్నాయి. రూ.6556.70 కోట్లతో వచ్చే ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌ను రూపొందిచినట్టు సమాచారం. ఇందులో సంస్థ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన పద్దు పార్ట్‌-ఏగా రూ.6150 కోట్లు కాగా.. ఎస్‌ఎన్‌డీపీ, రెండు పడకల ఇళ్ల కోసం ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను పార్ట్‌- బీగా రూ.406.70 కోట్లుగా ప్రతిపాదించారు. వాస్తవంగా నవంబర్‌ 10వ తేదీలోపే స్టాండింగ్‌ కమిటీలో పద్దు ప్రవేశపెట్టాల్సి ఉండగా.. ఈసారి తీవ్ర జాప్యం జరిగింది. అసెంబ్లీ, పార్లమెంట్‌ సమా వేశాలున్న నేపథ్యంలో.. ఆ తర్వాత నిర్వహించే గ్రేటర్‌ కౌన్సిల్‌లో బడ్జెట్‌ ప్రవే శ పెట్టనున్నారు. అంతకుముందు స్టాండింగ్‌ కమిటీ ఆమోదించాల్సి ఉంది.

Updated Date - 2022-03-15T14:16:13+05:30 IST