రేపే ఇంటర్‌ ఫలితాలు

ABN , First Publish Date - 2022-06-27T16:41:19+05:30 IST

ఇంటర్మీడియట్‌ ఫలితాలను మంగళవారం (28వ తేదీన) విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను మే 6వ

రేపే ఇంటర్‌ ఫలితాలు

ఉదయం 11 గంటలకు విడుదల.. టెన్త్‌ ఫలితాలు 30న లేదా 1న! 

హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ఫలితాలను మంగళవారం (28వ తేదీన) విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను మే 6వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 9.07 లక్షల మంది ఉన్నారు.  కాగా ఈ ఫలితాలను https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in, https://examresults.ts.nic.in   అనే వెబ్‌సైట్‌లో విద్యార్థులు చూడవచ్చని అధికారులు ప్రకటించారు. కాగా పదో తరగతి పరీక్ష ఫలితాలను 30న లేదంటే జూలై 1వ తేదీన విడుదల చేసే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 


టెట్‌ ఫలితాలు నేడు ప్రకటిస్తారా? 

టెట్‌ ఫలితాలను షెడ్యూల్‌ ప్రకారం సోమవారం (27వ తేదీన) ప్రకటించాల్సి ఉంది. మరి.. ఆ రోజు ప్రకటిస్తారా లేదా? అనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ప్రాథమిక కీని విడుదల చేసిన అధికారులు తుది కీని మాత్రం ఇంకా విడుదల చేయలేదు. ఈ తుది కీని ఫలితాలతో పాటే విడుదల చేస్తారా? లేక కొంత ముందుగా ప్రకటిస్తారా? అనే అంశంలోనూ అధికారుల నుంచి సమాచారం రావడం లేదు. ప్రాథమిక కీపై సుమారు 14 వేల అభ్యంతరాలు నమోదయ్యాయి. వాటిని పరిష్కరించిన తర్వాతనే పలితాలను ప్రకటించాల్సి ఉంటుంది.

Updated Date - 2022-06-27T16:41:19+05:30 IST