ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై... రేపు సమావేశం

ABN , First Publish Date - 2022-05-26T23:26:12+05:30 IST

ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై... ASCIతో వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి... ఈ-కామర్స్ సంస్థలు, వాటాదారులతో రేపేు(శుక్రవారం) సమావేశాన్ని నిర్వహించనున్నారు.

ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై... రేపు సమావేశం

న్యూఢిల్లీ : ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై... ASCIతో వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి... ఈ-కామర్స్ సంస్థలు, వాటాదారులతో రేపు(శుక్రవారం) సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ సేవలు, లేదా... ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వినియోగదారులను తప్పుదారి పట్టించే ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై నకిలీ సమీక్షల పరిమాణాన్ని అంచనా వేయడానికి, ముందస్తుగా రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడానికి, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ASCI)తో కలిసి వినియోగదారుల వ్యవహారాల విభాగం (DoCA) శుక్రవారం వివిధ వాటాదారులతో కలిసి వర్చువల్ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ క్రమంలో... సెక్రటరీ DoCA, రోహిత్ కుమార్ సింగ్ వాటాదారులకు లేఖలు రాశారు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, టాటా సన్స్, రిలయన్స్ రిటైల్ వంటి ఈ-కామర్స్ సంస్థలు, వినియోగదారుల ఫోరమ్‌లు, న్యాయ విశ్వవిద్యాలయాలు, న్యాయవాదులు, FICCI, CII, వినియోగదారుల హక్కుల కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

Updated Date - 2022-05-26T23:26:12+05:30 IST