రేపు స్పందన: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-11-28T06:29:44+05:30 IST

కలెక్టరేట్‌లోని సునయనలో సోమవారం జరిగే స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఒక ప్రకటనలో కోరారు.

రేపు స్పందన: కలెక్టర్‌

కర్నూలు(కలెక్టరేట్‌), నవంబరు 27: కలెక్టరేట్‌లోని సునయనలో సోమవారం జరిగే స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఒక ప్రకటనలో కోరారు. మండల కేంద్రాల్లో తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధిత అఽధికారులు తప్పకుండా హాజరు కావాలన్నారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం వాటి పరిష్కారంపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో అర్జీదారులు తప్పకుండా మాస్కులు ధరించి రావాలని ఆయన కోరారు. 

Updated Date - 2021-11-28T06:29:44+05:30 IST