2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంపై ట్రంప్ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2021-02-19T15:14:12+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తన రాజకీయ భవిష్యత్తుపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంపై ట్రంప్ ఏమన్నారంటే..

ఫ్లోరిడా: అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తన రాజకీయ భవిష్యత్తుపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం గురించి తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని, దాని గురించి ఏమైనా చెబితే అది తొందరపాటు చర్య అవుతుందన్నారు. ఇక అధ్యక్ష భవనాన్ని వీడిన తర్వాత దాదాపు నెలరోజులుగా ఆయన మీడియా ముందుకు రాలేదు. కానీ, బుధవారం రేడియో దివంగత వ్యాఖ్యాత రష్ లింబా(70)కు నివాళులు అర్పించేందుకు ట్రంప్ బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 


'2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ విషయమై ఇప్పుడే ఏమైనా చెబితే.. అది తొందరపాటు చర్య అవుతుంది. కనుక దీని గురించి ఇప్పడు మాట్లాడటం సరికాదు. చాలా గొప్ప ఎన్నికలు ముందున్నాయి. నేను దాని గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. కానీ, నాకు బ్రహ్మాండమైన మద్దతు ఉంది. ఇక రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్న వ్యక్తిని కూడా నేనే. ' అని చెప్పుకొచ్చారు. అలాగే మాజీ అధ్యక్షుడి హయాంలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ సరిగ్గా జరగలేదని, తాను బాధ్యతలు చేపట్టిన అనంతరం కరోనా టీకాలు ఏమీ లేవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. ​'బైడెన్​ అబద్ధమైనా చెప్తుండాలి లేదా ఆయనకు మానసిక రుగ్మతైనా తలెత్తి ఉండాలి' అని ట్రంప్​ చురకలంటించారు.

Updated Date - 2021-02-19T15:14:12+05:30 IST