‘ఇండియా ఇష్టమొచ్చినట్లు చేస్తుంటే.. కోరల్లేని ఐసీసీ ఏం చేయట్లేదు’

ABN , First Publish Date - 2021-02-28T10:02:14+05:30 IST

భారత్, ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య టెస్టు సిరీసు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీసులో తొలి మ్యాచ్ ఓడిన భారత్.. ఆ తర్వాతి రెండు మ్యాచుల్లోనూ ఘనవిజయం సాధించింది. అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టెస్టు కనీసం ఐదు రోజులు కూడా సాగలేదు.

‘ఇండియా ఇష్టమొచ్చినట్లు చేస్తుంటే.. కోరల్లేని ఐసీసీ ఏం చేయట్లేదు’

అహ్మదాబాద్: భారత్, ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య టెస్టు సిరీసు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీసులో తొలి మ్యాచ్ ఓడిన భారత్.. ఆ తర్వాతి రెండు మ్యాచుల్లోనూ ఘనవిజయం సాధించింది. అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టెస్టు కనీసం ఐదు రోజులు కూడా సాగలేదు. ఈ డే/నైట్ టెస్టు రెండ్రోజుల్లోనే ముగిసింది. దీనిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాగన్ మండిపడ్డాడు. మొతేరాలో తయారు చేసిన పిచ్‌ను అతను తప్పుబట్టాడు. ఇలాంటి పిచ్‌ తయారు చేస్తుంటే ఐసీసీ కలుగజేసుకోవాలని అన్నాడు. ‘‘భారత్ వంటి బలమైన దేశాలు ఇలా చేసి తప్పించుకుంటూ ఉన్నంత కాలం ఐసీసీ కోరల్లేని పులిలానే కనబడుతుంది’’ అని వాగన్ విమర్శించాడు. ఇండియా ఏం కావాలంటే అది సిద్ధం చేసుకోవడానికి ఐసీసీ అనుమతులు ఇస్తోందని, ఇలా చేయడం వల్ల చివరకు టెస్టు క్రికెట్‌ దెబ్బ తింటోందని ఆందోళన వ్యక్తం చేశాడు.

Updated Date - 2021-02-28T10:02:14+05:30 IST