Canada Jobs: ఈ కోర్సులు పూర్తి చేస్తే చాలు.. కెనడాలో జాబ్స్ పక్కా.. ఆ ఉద్యోగానికి ఏకంగా రూ.73 లక్షల వేతనం..!

ABN , First Publish Date - 2022-09-08T01:01:37+05:30 IST

పెద్ద పెద్ద చదువులు చదివిన వారికే విదేశాల్లో మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయా? అంటే దీనికి సమాధానం కచ్చితంగా కాదు అని చెప్పొచ్చు. కేవలం ఏడాది, రెండేళ్ల నిడివితో కూడిన సర్టిఫికేట్ కోర్సులు(certificate courses) పూర్తి

Canada Jobs: ఈ కోర్సులు పూర్తి చేస్తే చాలు.. కెనడాలో జాబ్స్ పక్కా.. ఆ ఉద్యోగానికి ఏకంగా రూ.73 లక్షల వేతనం..!

ఎన్నారై డెస్క్: పెద్ద పెద్ద చదువులు చదివిన వారికే విదేశాల్లో మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయా? అంటే దీనికి సమాధానం కచ్చితంగా కాదు అని చెప్పొచ్చు. కేవలం ఏడాది, రెండేళ్ల నిడివితో కూడిన సర్టిఫికేట్ కోర్సులు(certificate courses) పూర్తి చేసినా చాలా దేశాల్లో మంచి వేతనాలతో కూడిన ఉద్యోగాలు పొందొచ్చు. దీనికి కెనడా(Canada)నే బెస్ట్ ఎగ్జాంపుల్. కొన్ని సర్టిఫికెట్ కోర్సులకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఇంతకూ ఆ కోర్సులు ఏంటి? వాటిని పూర్తి చేసిన వాళ్లు ఎంత మేరకు జీతాన్ని అందుకోవచ్చు? అనే పూర్తి వివరాలపై ఓలుక్కేస్తే..


వెబ్ డిజైనింగ్ (Web designers)

క్రియేటివిటీగా ఆలోచించే వాళ్ల కోసమే జాబ్. అటువంటి వాళ్లు ఈ ఫీల్డ్‌లో దూసుకుపోతారు. వినూత్న ఆలోచనలకు టెక్నాలజీని జత చేసి, వెబ్‌ సైట్లను, వెబ్ పేజీలను ఆకట్టుకునేలా రూపొందించడమే వెబ్ డిజైనర్లు చేయాల్సిన పని. కెనడాలోని కొన్ని సంస్థలు వెబ్ డిజైనింగ్‌లో సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు తమను తాము నిరూపించుకుంటే గరిష్టంగా 92వేల డాలర్ల(రూ.73.49లక్షలు) వార్షిక వేతనంగా పొందొచ్చు. లేదంటే తక్కువలో తక్కువ 37వేల డాలర్ల(రూ.29.5లక్షలు)ను జీతంగా తీసుకోవొచ్చు.



డ్రాఫ్టింగ్ టెక్నీషియన్ (Drafting Technician)

సాంకేతిక రంగం రోజు రోజుకూ వేగంగా అభివృద్ధి చెందుతోంది. చాలా రంగాలకు టెక్నాలజీ వెన్నెముకగా మారుతోంది. ఈ క్రమంలో టెలీకమ్యూనికేషన్ టెక్నీషన్ ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది. డ్రాఫ్టింగ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి నైపుణ్యాలు పొందిన అభ్యర్థులు తక్కవలో తక్కవ ఏడాదికి 35వేల డాలర్లను జీతంగా తీసుకోవచ్చు. ఈ ఫీల్డ్‌లో పని చేసే వాళ్లు.. ప్రస్తుతం అత్యధికంగా 83వేల డాలర్ల వరకు వార్షిక వేతనం తీసుకుంటున్నారు. డ్రాఫ్టింగ్ టెక్నీషియన్లు చేయాల్సిన పని ఏంటంటే.. ఆప్టిక్ కేబుల్ పరికరాలను ఇన్‌స్టాల్, రిపేర్ వంటివి చేయాల్సి ఉంటుంది. చాలా సంస్థలు ఈ కోర్సును ఆన్‌లైన్ ద్వారా కూడా అందిస్తున్నాయి. 


మేకప్ ఆర్టిస్ట్ (Makeup Artist)

వివాహాది శుభకార్యాలకు ప్రస్తుతం ప్రజలు ఎక్కువ మొత్తంలో వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకప్ ఆర్టిస్ట్‌లకు డిమాండ్ బాగా పెరిగింది. మేకప్ ఆర్టిస్టులకు గంటల చొప్పున డబ్బులు చెల్లిస్తారు. మేకప్ ఆర్టిస్ కోర్సు పూర్తి మంచి నైపుణ్యాలను సొంతం చేసుకుంటే.. గరిష్టంగా గంటకు 40డాలర్ల(కనిష్టంగా 16.80డాలర్లు) చొప్పున అందుకోవచ్చు.


ఈవెంట్ ప్లానర్ (Event Planner)

ఒక కార్యక్రమం విజయవంతంగా ముగియడం వెనక ఈవెంట్ ప్లానర్ శ్రమ కచ్చితంగా ఉంటుంది. కార్యక్రమంలో పాల్గొనే ప్రజల సంఖ్య, బడ్జెట్ ఆధారంగా ఎవ్వరి మనసులు నొచ్చుకోకుండా.. అదే సమయంలో ప్రోగ్రామ్ పట్టాలు తప్పుకుండా ఉండాలంటే పర్‌ఫెక్ట్ ప్లానింగ్ అవసరం. ఈవెంట్ ప్లానర్స్‌కు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా చాలా సంస్థలు సర్టిఫికెట్ కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి. ఈ కోర్సు పూర్తి చేసి, కాస్త అనుభవం గడిస్తే వార్షిక వేతనంగా తక్కువలో తక్కువ 32వేల డాలర్ల నుంచి గరిష్టంగా 72వేల డాలర్ల వరకు తీసుకోవచ్చు. వీటితో పాటు 911 Dispatcher కోర్సుకూ మంచి డిమాండ్ ఉంది. ఈ కోర్సు పూర్తి చేసిన వాళ్లు.. వేగంగా ఆలోచిస్తూ ఫైర్, పోలీస్, హెల్త్ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పని చేయాల్సి ఉంటుంది. వార్షిక వేతనంగా 33000-80వేల డాలర్ల వరకు పొందొచ్చు.


Updated Date - 2022-09-08T01:01:37+05:30 IST