కొత్త టెక్నాలజీపై అవగాహన పెంచుకోండి: జడ్జీలకు జస్టిస్ ఎన్వీ రమణ సూచన

ABN , First Publish Date - 2022-04-10T01:49:24+05:30 IST

మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త అంశాలపై విచారణకు సిద్ధంగా ఉండాలని జడ్జీలకు సూచించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ. మీడియేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంశాలపై గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో శనివారం జాతీయ న్యాయ సదస్సు జరిగింది.

కొత్త టెక్నాలజీపై అవగాహన పెంచుకోండి: జడ్జీలకు జస్టిస్ ఎన్వీ రమణ సూచన

మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త అంశాలపై విచారణకు సిద్ధంగా ఉండాలని జడ్జీలకు సూచించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ. మీడియేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంశాలపై గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో శనివారం జాతీయ న్యాయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తోపాటు, కేంద్ర న్యాయశాఖా మంత్రి జస్టిస్ కిరణ్ రిజిజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ మాట్లాడుతూ జడ్జీలు, లాయర్లు, న్యాయ నిపుణులు, సంస్థలు కొత్త అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ‘‘క్రిప్టో కరెన్సీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా ప్రొటెక్షన్, ఎన్‌క్రిప్షన్ వంటి కొత్త టెక్నాలజీలపై లోతైన అవగాహన ఏర్పర్చుకోవాలి. కొత్త టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నకొద్దీ దేశంలో న్యాయపరమైన ఇబ్బందులు పుట్టుకొస్తాయి. కాలం గడిచేకొద్దీ కేసులూ పెరుగుతాయి’’ అని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2022-04-10T01:49:24+05:30 IST