ఏపీ (AP)లో స్టాప్ గ్యాప్ ప్రభుత్వం నడుస్తోంది: Lanka Dinakar

ABN , First Publish Date - 2022-05-15T15:50:13+05:30 IST

ఏపీ (AP)లో "స్టాప్ గ్యాప్ ప్రభుత్వం" నడుస్తోంది: Lanka Dinakar

ఏపీ (AP)లో స్టాప్ గ్యాప్ ప్రభుత్వం నడుస్తోంది: Lanka Dinakar

హైదరాబాద్: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై BJP Leader బీజేపీ నేత లంకా దినకర్ (BJP Leader Lanka Dinakar) విమర్శలు గుప్పించారు. 9 నెలలైనా పులిచింతల ప్రాజెక్ట్‌కు గేటు పెట్టలేనివారికి పోలవరం పూర్తి చేసే సామర్థ్యం ఉందా? అని బీజేపీ నేత లంకా దినకర్ ప్రశ్నించారు. పులిచింతలకు రూ.7.75 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని స్థితిలో జగన్ సర్కార్ ఉందని వెల్లడించారు. ఏపీలో "స్టాప్ గ్యాప్ ప్రభుత్వం" నడుస్తోందని, అందుకే పులిచింతల దగ్గర "స్టాప్ లాగ్ గేట్"తో కాలం వెల్లబుచ్చుతున్నారని మండిపడ్డారు. అన్నమయ్య ప్రాజెక్ట్ దగ్గర అశ్రద్ధతో వచ్చిన ఇబ్బంది.. 45.77 టీఎంసీ సామర్థ్యం ఉన్న పులిచింతల ప్రాజెక్ట్‌ దగ్గర కూడా రావచ్చని లంకా దినకర్ గుర్తు చేశారు. ఒక చిన్న గేట్ ఏర్పాటుపైనా ఇంత అశ్రద్ధ ఉంటే ఎలా అని లంకా దినకర్ అన్నారు. జగన్‌ పాలనలో నీటి ప్రాజెక్టుల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని లంకా దినకర్ వెల్లడించారు.

Updated Date - 2022-05-15T15:50:13+05:30 IST