కరోనా టీకా కోసం తొందరపడి.. భారీ మూల్యం చెల్లించుకున్న సైనిక జనరల్!

ABN , First Publish Date - 2021-01-24T23:17:01+05:30 IST

: ఆయన స్పెయిన్‌లో అత్యున్నత సైనిక జనరల్.. రక్షణ శాఖ సిబ్బందికి చీఫ్. కానీ ఫ్రంట్‌లైన్ వర్కర్లకంటే ముందే కరోనా టీకా వేయించున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన భారీ మూల్యం చెల్లించుకున్నారు.

కరోనా టీకా కోసం తొందరపడి.. భారీ మూల్యం చెల్లించుకున్న సైనిక జనరల్!

మ్యాడ్రిడ్: ఆయన స్పెయిన్‌లో అత్యున్నత సైనిక జనరల్.. రక్షణ శాఖ సిబ్బందికి చీఫ్. కానీ ఫ్రంట్‌లైన్ వర్కర్లకంటే ముందే కరోనా టీకా వేయించున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన భారీ మూల్యం చెల్లించుకున్నారు. దేశంలో పెద్ద ఎత్తున ప్రజాగ్రహం వ్యక్తమవడంతో ఆయన చివరికి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇలా అనూహ్యంగా పదవిచ్ఛితుడైన సదరు జనరల్ పేరు మిగేల్ యాంజెల్ విల్లోరియా! శనివారం నాడు మిగేల్ తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అంతకుమనుపు.. స్పెయిన్ పత్రికల్లో మిగెల్‌పై వస్తున్న ఆరోపణలను గురించి రక్షణ మంత్రి ఆయన్ను వివరణ కోరినట్టు తెలిసింది. 


కాగా..మిగేల్ రాజీనామా గురించి రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. సదరు జనరల్ ముందుగా వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఎక్కడా ప్రస్తావించలేదు. అత్యున్నత సైనికాధికారిగా తనకున్న విశిష్టఅధికారాలను ఆయన ఎన్నడూ దుర్వినియోగ పరచలేదని రక్షణ శాఖ పేర్కొంది. తనకు సబబుగా అనిపించిందే  ఆయన చేశారని, కానీ ఈ చర్యలు ప్రజల దృష్టిలో సైన్యం ప్రతిష్టను దిగజార్చినట్టు పేర్కొంది. కాగా.. సైనిక జనరల్ వైఖరిపై స్పెయిన్‌లో ప్రజాగ్రహం తీవ్రస్థాయిలో వ్యక్తమవుతోంది. ప్రాధాన్య క్రమం ప్రకారం ముందుగా వైద్య సిబ్బందికి టీకా వేయాల్సి ఉంది. దీన్ని మిగెల్ ఉల్లంఘించారంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇక్కడ క్యూలో 87 ఏళ్ల ఆల్జైమర్స్ వ్యాధిగ్రస్థుడు ఉన్నారు. ఓ మాజీ నర్సు, మరో క్లర్క్ కూడా ఉన్నారు. మీరు మాకంటే ఏ రకంగా ముఖ్యమైన వారు అంటూ ఓ నెటిజన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2021-01-24T23:17:01+05:30 IST