వంటలు
టోఫు మేదు వడ

కావాల్సిన పదార్థాలు: టోఫు (బీన్‌ కర్డ్‌) - 200 గ్రా, ఇడ్లీ పిండి - 50 గ్రా, రవ్వ- 20 గ్రా, జొన్నపిండి- 30 గ్రా, ఉప్పు- 6 గ్రా, కరివేపాకు - 30 గ్రా, వేయించిన శెనగపప్పు - 30 గ్రా, ఎండుమిర్చి - 20గ్రా, కొత్తిమీర- 20 గ్రా, కొబ్బరి- 50 గ్రా, అల్లం-8 గ్రా,  రిఫైండ్‌ ఆయిల్‌ - 50మి.లీ, మినప్పప్పు- 5 గ్రా.


తయారీ విధానం: ముందుగా టోఫును ముక్కలుగా చేసి నీటిలో కొద్దిగా ఉప్పు వేసి నాన బెట్టాలి.


కరివేపాకు గన్‌ పౌడర్‌ తయారీ కోసం...

నూనెలో కరివేపాకు బాగా వేయించి, ఆ తరువాత గది ఉష్ణోగ్రత వద్ద చల్లబరచాలి. ఓ పాన్‌లో కొద్దిగా నూనె తీసుకుని మినప్పప్పు, శెనగపప్పు. ఎండు మిరపకాయలను వేయించాలి. చల్లారిన తరువాత ఈ మిశ్రమాన్ని కరివేపాకుతో కలిపి పొడిలా చేసుకోవాలి.


మేదు వడ తయారీ కోసం...

ఓ గిన్నెలో ఇడ్లీ పిండి, రవ్వ, జొన్నపిండి, ఉప్పు, కరివేపాకు, అల్లం, నీరు తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమంలో తోపు ముక్కలను మించి కరకరలాడేలా వేయించాలి. ఆ తరువాత దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న కరివేపాకు పిండి కలుపుకొని సర్వ్‌ చేసుకోవాలి.

Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.