ఓటమితో ‘టొరొంటో’కు సెరెనా వీడ్కోలు

Published: Fri, 12 Aug 2022 03:57:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఓటమితో టొరొంటోకు సెరెనా వీడ్కోలు

టొరంటో: సుదీర్ఘ కెరీర్‌కు త్వరలో రిటైర్మెంట్‌ ప్రకటించనున్న అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌.. టొరొంటో మాస్టర్స్‌ టోర్నీని ఓటమితో ముగించింది. రెండో రౌండ్‌లో సెరెనా 2-6, 4-6తో బెలిండా బెనిసిక్‌ (స్విస్‌) చేతిలో పరాజయం పాలైంది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత సెరెనా ప్రసంగం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. విలియమ్స్‌ గద్గద స్వరంతో ఫ్యాన్స్‌ను పలకరించింది. వీడ్కోలు పలకడానికి సిద్ధమయ్యానని చెప్పింది. రిటైర్మెంట్‌ గురించి ఆమె కచ్చితంగా చెప్పకపోయినా.. ఈ నెలాఖరులో జరిగే యూఎస్‌ ఓపెన్‌ తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలున్నాయి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.