నాటు సారా తయారీ విక్రయాలపై గ్రామ పెద్దల కఠిన నిర్ణయాలు

ABN , First Publish Date - 2022-04-30T15:16:23+05:30 IST

నాటు సారా తయారీ విక్రయాలపై ఆ గ్రామంలో గ్రామ పెద్దలు కఠినమైన నిర్ణయాలు తీర్మానాలు చేశారు.

నాటు సారా తయారీ విక్రయాలపై గ్రామ పెద్దల కఠిన నిర్ణయాలు

చిత్తూరు: నాటు సారా తయారీ విక్రయాలపై ఆ గ్రామంలో గ్రామ పెద్దలు కఠినమైన నిర్ణయాలు, తీర్మానాలు చేశారు. నాటు సారా తయారు చేసిన, అమ్మినా గ్రామం నుంచి బహిష్కరిస్తామని పంచాయతీలో గ్రామ పెద్దల తీర్మానా చేశారు. జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలం వీరక నెల్లూరు పంచాయితీలో గ్రామ పెద్దలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి నాటుసారా విక్రయిస్తే గ్రామం నుంచి వెలి వేస్తామని గ్రామ పెద్దలు హెచ్చరించారు. త్వరలో జరగనున్న గంగ జాతరను పురస్కరించుకుని ఎలాంటి గొడవలకు తావు ఉండకూడదన్న ఉద్దేశంతో గ్రామములో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు వెల్లడించారు. 

Updated Date - 2022-04-30T15:16:23+05:30 IST