నిజాంసాగర్‌కు పర్యాటకుల తాకిడి

ABN , First Publish Date - 2021-07-25T04:59:40+05:30 IST

నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటిని ఆస్వాదించేందుకు శనివారం పర్యాటకుల సందడి మొదలై ంది.

నిజాంసాగర్‌కు పర్యాటకుల తాకిడి
గార్డెన్‌లో పర్యటిస్తున్న పర్యాటకులు

నిజాంసాగర్‌, జూలై 24: నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటిని ఆస్వాదించేందుకు శనివారం పర్యాటకుల సందడి మొదలై ంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజె క్టులో భారీ వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టు నీటి సామర్థ్యం క్రమేపీ పెరుగుతోంది. ఈ నీటిని ఆస్వాదించడా నికి ఉభయ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, మెదక్‌, సంగారెడ్డి ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. పర్యాటకులు అంతర్‌ భాగంలో ఉన్న ఛత్రీనౌక బంగ్లాలోని కి ప్రవేశించి కేరింతలు చేస్తున్నారు. గార్డెన్లలో పర్యాటకులు సందడి చేస్తూనే ఉన్నారు. పర్యాటకుల వాహనాలతో గుల్‌ గస్త్‌ రహదారి కిటకిటలాడింది. పర్యాటకులు ఆస్వాదించేం దుకు ఇటీవల గుల్‌గస్త్‌ గార్డెన్‌ను మెరుగు పర్చినప్పటికీ గార్డెన్‌లో ఉన్న ఫౌంటెన్లలో నీరు విరజిమ్మక పోవడంతో పర్యాటకులు నిరాశకు లోనయ్యారు. ఈ గార్డెన్‌లో కనీస సౌకర్యాల కల్పనకు కృషి చేయాల్సిన పాలకులు, పర్యాటకు లు పట్టించుకోవడం లేదనే విమర్శలు న్నాయి. సాగర్‌లోకి వరద నీరు వస్తుండటంతో ఇక నుంచి పర్యాటకులు తండోప తండాలుగా రానున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టులో కి ఎగువ ప్రాంతాల నుంచి 10,500 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. 1,405 అడుగులకు గాను 1,398.16 అడుగు లకు చేరింది. నిజాంసాగర్‌లో 9.998 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారి శ్రావణ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. సింగీతం, కౌలాస్‌, కళ్యాణి రిజర్వాయర్లలో ఎగువ ప్రాంతా ల నుంచి వరద నీరు వస్తుండటంతో సింగీతం 2,100 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాల్వ ద్వారా విడుదల చేస్తు న్నారు. కౌలాస్‌నాలాలో 1,404 క్యూసెక్కుల నీటిని వరద గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. కళ్యాణికి 323 క్యూ సెక్కుల నీరు వస్తుండటంతో దిగువకు వదులుతున్నారు.

Updated Date - 2021-07-25T04:59:40+05:30 IST