
రియాద్: టూరిస్ట్ వీసాదారులు (Tourist Visa Holders) హజ్ ఆచారాలను నిర్వహించడానికి అనుమతి లేదని పర్యాటక మంత్రిత్వశాఖ (Ministry of Tourism) స్పష్టం చేసింది. కింగ్‌డమ్ నిబంధనల ప్రకారం పర్యాటక వీసాదారులు హజ్ చేయకుండా నిరోధిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా సంబంధిత అధికారులు గుర్తు చేశారు. హజ్, ఉమ్రా మంత్రిత్వశాఖ నిర్ణయించిన హజ్ సీజన్‌లో ఉమ్రా చేయకుండా వారిని నిరోధిస్తుందని మంత్రిత్వశాఖ తెలిపింది.

అయితే, టూరిస్ట్ వీసాదారులు సాధారణ రోజుల్లో ఈట్మార్నా (Eatmarna) లేదా తవక్కల్న (Tawakkalna) యాప్‌ల ద్వారా అపాయింట్‌మెంట్ పొంది ఉమ్రా నిర్వహించుకోవచ్చని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక హజ్ సీజన్‌లో మాత్రం ఎవరికీ ఉమ్రా నిర్వహించడానికి అనుమతి లేదని పేర్కొంది. పర్యాటకం కోసం విజిట్ వీసాపై సౌదీ రావాలనుకునే వారు వీసా పొందే ముందు సూచనలకు కట్టుబడి ఉండాలని మంత్రిత్వశాఖ సూచించింది. ఇందుకు సంబంధించి జారీ చేసిన అన్ని సూచనలను పూర్తిగా పాటించాలని కోరింది.
ఇవి కూడా చదవండి