జ్యోతిప్రజ్వలన చేస్తున్న ట్రస్టు సభ్యులు
అలరించిన కళా ప్రదర్శనలు
నెల్లూరు(సాంస్కృతిక, ప్రతినిధి), జనవరి 23 : పది నెలల తర్వాత నగరపుర మందిరం పునః ప్రారంభమైంది. టౌనుహాలు ట్రస్టు సభ్యులు వాకాటి విజయకుమార్‌రెడ్డి, రేబాల ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రెడ్‌క్రాస్ కేన్సర్ హాస్పిటల్ కన్వీనర్ తుండా శివప్రసాద్‌రెడ్డి, మేనేజర్ హరికుమార్‌రెడ్డి నిరాడంబరంగా జ్యోతిప్రజ్వలన చేసి నగర పురమందిరాన్ని పునః ప్రారంభించారు. ఎలాంటి ఉపన్యాసాలు లేకుండా జె బాలార్క శిష్య బృందం సంగీత విభావరి నిర్వహించింది. దాదాపు 45 సంగీత కీర్తనలు అలంరించాయి. నృత్యగురువు సుభి గాయత్రి విద్యార్థులు గంటకు పైగా చేసిన శాస్త్రీయ నృత్య విభావరి అభిమానులను అలరించింది. కానీ ప్రేక్షకులు ఎక్కువగా రాలేదు. పురమందిరం పునః ప్రారంభంతో కళా సంస్థలు, కళాకారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.