కనకవీడులో విష జ్వరాలు

ABN , First Publish Date - 2021-10-14T05:15:39+05:30 IST

మండలంలోని కనకవీడు గ్రామంలో విషజ్వరాలతో పిల్లలు, పెద్దలు అల్లాడుతున్నారు. గత రెండు రోజులుగా గ్రామంలో విషజ్వరాల తీవ్రత పెరిగింది.

కనకవీడులో విష జ్వరాలు
చికిత్స పొందుతున్న చిన్నారి

నందవరం, అక్టోబరు 13 : మండలంలోని కనకవీడు గ్రామంలో విషజ్వరాలతో పిల్లలు, పెద్దలు అల్లాడుతున్నారు. గత రెండు రోజులుగా గ్రామంలో విషజ్వరాల తీవ్రత పెరిగింది. ఎమ్మిగనూరు, ఆదోని, కర్నూలు ప్రాంతాలలో దాదాపు 60మందికి పైగా చికిత్స పొందుతున్నారు.  రక్తకణాలు తగ్గాయని, ఏమీ చేయలేమని డాక్టర్లు చేతులెత్తేస్తున్నారని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. దీంతో సుదూర ప్రాంతాల ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందని అంటున్నారు. అయినా వైద్య అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మరోపక్క పిల్లలకు డెంగీ లక్షణాలు ఉన్నాయని అసుపత్రుల్లో చెబుతుండటంతో తల్లిదండ్రులు భయందోళనకు గురౌతున్నారు. హెల్త్‌ అధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


 పట్టించుకునే వారే లేరు


 పిల్లలకు విష జ్వరాలు వచ్చాయి. డెంగీ అంటున్నారు. ప్రైవేటు ఆసుత్రుల్లో వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. అయినా అధికారులు పట్టించుకోవడంలేదు. 


-మల్లికార్జున, కనకవీడు 


మెడికల్‌ క్యాంప్‌ నిర్వహిస్తాం

 

కనకవీడు గ్రామంలో గురువారం హెల్త్‌ క్యాంప్‌ ఏర్పాటు చేస్తాం. ఇంటింటికి తిరికి శాంపిల్స్‌ తీసుకుంటాం. ప్రతి ఒక్కరికీ  చికిత్స చేస్తాం.                        


 -ఇస్మాయిల్‌, హెల్త్‌ అసిస్టెంట్‌  

Updated Date - 2021-10-14T05:15:39+05:30 IST